Telangana: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. రాధాకిషన్‌ అరెస్ట్..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో రోజుకో సంచలనం బయటపడుతోంది. తీగలాగుతున్నకొద్దీ డొంక కదులుతోంది.. కొత్తకొత్త కోణాలు, పెను సంచలనాలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, తిరపతన్నను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌లో ప్రణీత్‌రావుతో పాటు మాజీ అధికారి రాధాకిషన్‌ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Telangana: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. రాధాకిషన్‌ అరెస్ట్..
Radhakishan Rao Arrest
Follow us

|

Updated on: Mar 29, 2024 | 9:52 AM

Phone Tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో రోజుకో సంచలనం బయటపడుతోంది. తీగలాగుతున్నకొద్దీ డొంక కదులుతోంది.. కొత్తకొత్త కోణాలు, పెను సంచలనాలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, తిరపతన్నను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌లో ప్రణీత్‌రావుతో పాటు మాజీ అధికారి రాధాకిషన్‌ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లు కనిపించకుండాపోయిన ఆయన.. నిన్న బంజారాహిల్స్‌ పీఎస్‌కి వెళ్లారు. రాధా కిషన్‌రావు నుంచి వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్ కుమార్ వివరాలు రాబట్టారు. ఆయన నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ప్రణీత్‌రావుతో సంబంధాలు? ఎంతకాలంగా ఫోన్ ట్యాపింగ్‌ చేశారు? ఏయే ప్రాంతాల్లో ట్యాపింగ్‌కి పాల్పడ్డారు? ట్యాపింగ్ సమాచారాన్ని ఎవరికి పంపించారనే కోణంలో విచారించారు. ఇవాళ రాధా కిషన్ రావును కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ప్రణీత్ రావు, ఏ-2గా భుజంగ రావు, ఏ-3గా తిరుపతన్న ఉన్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు కస్టడీ ఇప్పటికే ముగిసింది. అయితే భుజంగ రావు, తిరుపతన్నతో పాటు ప్రణీత్‌ను మరోసారి కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌పై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..