Congress: పార్టీ కేడర్‌లో కోల్డ్‌ వార్.. అధిష్టానానికి తలనొప్పిగా మారుతోన్న కాంగ్రెస్ ఘర్ వాపసి

పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాల గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఘర్ వాపసీ పేరుతో నేతలను ఆకర్షిస్తోంది. ఇదే ఇప్పుడు ఆపార్టీకి తలనొప్పిగా మారుతోంది. పార్టీ కేడర్‌లో కోల్డ్‌ వార్ రాజేస్తోంది. ఘర్‌ వాపసీ నల్గొండ జిల్లాలో మరీ ముఖ్యంగా చిచ్చు రేపుతోంది.

Congress: పార్టీ కేడర్‌లో కోల్డ్‌ వార్.. అధిష్టానానికి తలనొప్పిగా మారుతోన్న కాంగ్రెస్ ఘర్ వాపసి
Congress Joinings
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 28, 2024 | 8:00 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాల గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఘర్ వాపసీ పేరుతో నేతలను ఆకర్షిస్తోంది. ఇదే ఇప్పుడు ఆపార్టీకి తలనొప్పిగా మారుతోంది. పార్టీ కేడర్‌లో కోల్డ్‌ వార్ రాజేస్తోంది. ఘర్‌ వాపసీ నల్గొండ జిల్లాలో మరీ ముఖ్యంగా చిచ్చు రేపుతోంది.

పార్లమెంటు ఎన్నికల్లో దూకుడు పెంచింది టీకాంగ్రెస్. ఘర్ వాపసి పేరుతో పార్టీ వీడిన నేతలను తిరిగి ఆహ్వానిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలను భారీ మెజారిటీతో దక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగానే నల్లగొండ జిల్లా నుంచి పార్టీ చేరికలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. జిల్లాలో బీఆర్ఎస్‌కు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్, 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు. దీనికి జిల్లా సీనియర్ నేత జానారెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ లను సంప్రదించకుండా నేరుగా హైదరాబాద్ గాంధీభవన్ లో మున్సిపల్ చైర్మన్ భార్గవ్, 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీప్ దాస్ మున్షి సమక్షంలో కండువా కప్పుకుని పార్టీలో చేరారు.

మున్సిపల్ చైర్మన్ భార్గవ్ చేరిక మిర్యాలగూడ కాంగ్రెస్ లో చిచ్చురాజేసింది. భార్గవ్ కాంగ్రెస్‌లో చేరికను స్థానిక నేతలు, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భార్గవ్ చేరికను స్థానిక కాంగ్రెస్ నేతలు ప్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏపార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ గోడలు దూకే నాయకుల్లారా ఖబర్దార్ అంటూ మిర్యాలగూడలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలకు చెప్పుల దండలు వేసి నిరసన తెలిపారు. మరోవైపు వరంగల్ మేయర్ గుండు సుధారాణి చేరకను అక్కడి కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి.

మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో అత్యవసర భేటీ ఏర్పాటుచేశారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఈభేటీలో మున్సిపల్ చైర్మన్ భార్గవ్ చేరికను స్థానిక నాయకత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి నేతల చేరకతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందంటూ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఎవరు చేరాలన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. మిర్యాలగూడ కాంగ్రెస్ లో ఏర్పడ్డ అలజడిని తగ్గించేందుకు ఏకంగా PCCనే రంగంలోకి దిగింది. మున్సిపల్ చైర్మన్ భార్గవ్, ఇతర కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిక చెల్లదంటూ.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. స్థానిక జిల్లా నాయకుల అభిప్రాయాలు తీసుకోకుండానే పార్టీలో మున్సిపల్ చైర్మన్ భార్గవ్ చేరికను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. స్థానిక నాయకత్వంతో చర్చించి భార్గవ్ చేరికపై ఓ నిర్ణయం తీసుకుంటామన్న ఆయన స్టేట్మెంట్‌పై శంకర్ నాయక్, ఎమ్మెల్యే బిఎల్ఆర్ వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…