Telangana Inter Results: విద్యార్థులకు అలర్ట్‌.. తెలంగాణ ఇంటర్ రిజల్ట్‌ తేదీ వచ్చేసింది..

తెలంగాణలో ఇప్పుడు ఫలితాల పర్వం కొనసాగుతోంది. ఇక గతనెలలో తెలంగాణలో ఇంటర్మీడియేట్‌ పరీక్షలు జరిగాయి. అయితే ఫలితాల కోసం విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ఈనెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు..

Telangana Inter Results: విద్యార్థులకు అలర్ట్‌.. తెలంగాణ ఇంటర్ రిజల్ట్‌ తేదీ వచ్చేసింది..
Telangana Inter Result
Follow us

|

Updated on: Apr 22, 2024 | 5:19 PM

తెలంగాణలో ఇప్పుడు ఫలితాల పర్వం కొనసాగుతోంది. ఇక గతనెలలో తెలంగాణలో ఇంటర్మీడియేట్‌ పరీక్షలు జరిగాయి. అయితే ఫలితాల కోసం విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ఈనెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఫస్టియర్‌, సెకండియర్‌లో కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 10వ తేదీ వరకు మూల్యాంకణం పూర్తి కాగా, ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమైంది. మార్కుల నమోదు పాటు సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టారు.

కోడింగ్‌, డీకోడింగ్‌ ప్రక్రియ పూర్తి:

కాగా, విద్యార్థులు రాసిన జవాబుపత్రాలను మూడేసి సార్లు పరిశీలించి కోడింగ్‌, డీకోడింగ్‌ ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. గత సంవత్సరం మే 9న ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. సారి 15 రోజుల ముందే ఫలితాలను వెల్లడించాలని బోర్డు నిర్ణయించింది. అందుకు మూల్యాంకణం కూడా కూడా వేగంగానే చేపట్టింది. ఫలితాల కోసం https://tv9telugu.com/, tsbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్‌సైట్లలో చెక్‌ చేసుకోవచ్చు. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థుల సౌలభ్యం కోసం మార్కుల జాబితాను వివిధ మార్గాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలంగాణ ఇంటర్‌ బోర్డు వెల్లడించింది.

Ts Inter Result Date

Ts Inter Result Date

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?