వాహనదారులకు బిగ్ అలర్ట్.. 7 రోజుల్లోగా డీలర్లు ఆ పని పూర్తి చేయాల్సిందే.. రవాణా శాఖ కీలక ఆదేశాలు!

తెలంగాణలో కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చడంలో డీలర్ల నిర్లక్ష్యంపై రవాణా శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 1,54,032 వాహనాలకు ఇంకా HSRP ప్లేట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రక్రియను ఏడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. నిబంధనలు పాటించని డీలర్లపై జరిమానాలు, ట్రేడ్ సర్టిఫికెట్ సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

వాహనదారులకు బిగ్ అలర్ట్.. 7 రోజుల్లోగా డీలర్లు ఆ పని పూర్తి చేయాల్సిందే.. రవాణా శాఖ కీలక ఆదేశాలు!
Telangana Hsrp Number Plates

Edited By:

Updated on: Nov 21, 2026 | 5:31 PM

తెలంగాణలో కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) అమర్చడంలో డీలర్ల నిర్లక్ష్యంపై రవాణా శాఖ సీరియస్ అయింది. వాహన్ పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో 6,10,330 వాహనాలు రిజిస్టర్ కాగా, అందులో 1,54,032 వాహనాలకు ఇంకా HSRP ప్లేట్లు అమర్చాల్సి ఉందని అధికారులు గుర్తించారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు, 1989లోని రూల్ 50 ప్రకారం.. కొత్త వాహనాలకు HSRP అమర్చి, ఆ వివరాలను వాహన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాల్సిన పూర్తి బాధ్యత డీలర్లదేనని స్పష్టం చేసింది. దీని కోసం అధికారులు కూడా డీలర్లకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.

డీలర్లు HSRP వివరాలు అప్‌డేట్ చేయకపోవడంతో వాహనదారులకు RC కార్డుల ప్రింటింగ్ నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. HSRP లేకుండా వాహనాలు నడపడం CMV రూల్స్, MoRTH మార్గదర్శకాలకు విరుద్ధమని రవాణా శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో డీలర్ల వారీగా పెండింగ్ సమీక్షించి, 7 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని రిజిస్టరింగ్ అథారిటీలకు ఆదేశాలు జారీ చేసింది.

నిబంధనలు పాటించని డీలర్లపై షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు జరిమానాలు, ట్రేడ్ సర్టిఫికెట్ సస్పెన్షన్, వాహన్ పోర్టల్‌లో డీలర్ లాగిన్ బ్లాక్ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ హెచ్చరించింది. ఇప్పటివరకు HSRP లేదా RC కార్డు అందని వాహన యజమానులు వెంటనే తమ డీలర్లను లేదా సమీపంలోని RTA కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us