Telangana: రేపట్నుంచే రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే

రైతులకు శుభవార్త. వానాకాలం రైతుబంధు నిధులు అందుకునేందుకు వేళయ్యింది. మగళవారం నుంచే అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ అవ్వనుంది.

Telangana: రేపట్నుంచే రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే
Rythu Bandhu
Follow us

|

Updated on: Jun 27, 2022 | 5:58 PM

మంగళవారం(జూన్ 28) నుంచి నుంచి తెలంగాణ రైతులు ఖాతాల్లో వానాకాలం రైతుబంధు నిధులు(Rythu Bandhu money) జమ అవ్వనున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR)కు రైతుల పక్షాన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Singireddy Niranjan Reddy) ధన్యవాదాలు తెలిపారు. 68.10 లక్షల మంది అన్నదాతలు రైతుబంధుకు అర్హులని మంత్రి తెలిపారు. కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు సాయం అందనుందని వెల్లడించారు. పంపిణీకి  రూ.7521.80 కోట్ల నిధులు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఒక ఎకరా నుంచి మొదలుకుని ఆరోహణ క్రమం(చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య)లో రైతుల ఖాతాల్లో నిధులు జమవుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎకరాల వారీగా బిల్లుల జాబితా రూపొందించి ఆర్థికశాఖకు అందించింది వ్యవసాయ శాఖ. కాగా మొదటిసారి రైతుబంధు తీసుకునే రైతులు వెంటనే  సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా  వివరాలు అందించి నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

కేంద్రం ఎన్ని ఆర్థికపరమైన అడ్డంకులు సృష్టించినా రైతుల మీద అభిమానంతో రైతుబంధు నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు ఇచ్చారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి, కంది, ఇతర అపరాలు, నూనెగింజల పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కోరారు. జూలై 15వ తేదీ వరకు పత్తి విత్తుకునే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వర్షాలు కొంత ఆలస్యమయినందున తేలిక నేలలలో 5 నుండి 6.5 సెంటిమీటర్లు, బరువు నేలలలో 6 నుండి 7.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయిన తర్వాతనే రైతులు వర్షాధార పంటలను విత్తుకోవాలని మంత్రి సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక