Telangana: ఎల్‌నివో క్రమంలో తెలంగాణలోని రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం బిగ్ డెసిషన్..

ఎల్‌నివో పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. అందులో భాగంగా రైతులకు లబ్ది చేకూర్చేలా ప్రత్యామ్నాయ మర్గాలను ఆన్వేషిస్తోంది. అందులో భాగంగా రైతులకు తీపికబురు అందించింది. రాయితీపై విత్తనాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించనుంది.

Telangana: ఎల్‌నివో క్రమంలో తెలంగాణలోని రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం బిగ్ డెసిషన్..
Farmers

Updated on: Oct 19, 2026 | 6:39 PM

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఎల్‌నివో ప్రభావం వల్ల రైతులు నష్టపోతున్న క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాయితీపై విత్తనాలు పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఎల్‌నివో ఎఫెక్ట్ వద్ద పెద్దగా వర్షాలు లేకపోవడంతో రైతులు పంటల సాగు చేపట్టడం లేదు. దీంతో ప్రత్యామ్నాయంగా అరుతడి పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా కూరగాయలు, వప్పు ధాన్యాలు, నూనెగింజల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించడంతో పాటు రాయితీపై విత్తనాలు అందించనుంది. ఎల్‌నివో క్రమంలో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై వ్యవసాయ శాఖ ఒక నివేదికను సిద్దం చేసింది. యాసంగి సీజన్‌కు రాయితీపై విత్తనాలు అందించేందుకు రూ.224 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది.

గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు..

తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయవనరులు లభిస్తాయని యోచిస్తోంది. రైతులకు రాయితీపై విత్తనాలు అందించడం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గించేలా ప్లాన్ చేస్తోంది. ఉద్యాన పంటలు సాగును పెంచి రైతులకు ఆదాయం లభించేలా వ్యవసాయశాఖ ప్రణాళికలు రచిస్తోంది. వరి పంటకు బదులుగా కూరగాయలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు చేసేలా ప్రోత్సహించనుంది. వర్షాలు లేకపోవడంతో భూమిలో తేమ శాతం తగ్గుతుంది. దీని వల్ల మొక్కల పెరుగుదల మందగించడం వల్ల రైతులకు దిగుమబడి తగ్గే అవకాశముంది. దీంతో తక్కువ నీటితో పండే పంటలపై రైతులు దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది. అలాగే నీటి పొదుపుపై రైతులకు అవగాహన కల్పించేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించనుంది. గ్రామసభలు, రైతు మేళాలు నిర్వహించే అవగాహన పెంచనుంది.

భూగర్బ జలశాఖ, పంచాయతీ, గ్రామీణాభివృద్ది శాఖలు, వ్యవసాయ యూనివర్సిటీల సహకారంతో గ్రామ స్థాయిలో రైతులకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం, కుంటలను ఏర్పాటు చేసుకోవడం, మల్చింగ్ పద్దతి పాటించడం వంటి పద్దతులపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నేలలో తేమను ఎలా కాపాడుకోవాలనే దానిపై పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలనే దానిపై ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎల్‌నివో పరిస్థితుల క్రమంలో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక నివేదికను సిద్దం చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోె వ్యవసాయ శాఖ ప్రత్యేక నివేదికను సిద్దం చేసింది. ఎల్‌నివో పరిస్థితులను ఎలా తట్టుకోవాలనే దానిపై ఒక ప్రణాళిక సిద్దం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us