ఈఎస్‌ఐ స్కాం అప్డేట్: నిందితులకు రిమాండ్‌

తెలంగాణ ఈఎస్‌ఐ కుంభకోణం లోని తాజా కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.

ఈఎస్‌ఐ స్కాం అప్డేట్: నిందితులకు రిమాండ్‌
Follow us

|

Updated on: Sep 04, 2020 | 8:16 PM

తెలంగాణ ఈఎస్‌ఐ కుంభకోణం లోని తాజా కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితురాలు దేవికారాణి సహా తొమ్మిది మంది నిందితులను చంచల్‌గూడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే ఈకేసులో అరెస్ట్‌ లను సవాలు చేస్తూ నిందితుల తరఫు న్యాయవాదులు ఏబీసీ కోర్టులో పిటిషనల్‌ దాఖలు చేశారు. కావాలనే తమ క్లయింట్ లను ఇబ్బంది పెడుతున్నారంటూ కోర్టుకు విన్నవించారు. ఇదే తరహా కేసుల్లో గత సుప్రీం తీర్పులను కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు. పాత కేసుకు ప్రస్తుత కేసుకు నిందితుల పై ఒకే తరహా అభియోగాలు మోపారని.. దీనిలో అర్థం లేదని నిందితుల తరుఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న కోర్టు కేసును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.