Telangana Polls 2023: జనగామ టికెట్‌పై సస్పెన్స్‌కు తెరదించిన సీఎం కేసీఆర్

Updated on: Oct 15, 2023 | 6:19 PM

Telangana Election News: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనగామ అసెంబ్లీ నియోజకవర్గంపై అందరి ఫోకస్ నెలకొంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించి, డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలుసుకున్నారు. 

జనగామ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరు ఖరారైంది. పల్లాకు బీఫామ్‌ అందించారు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్. జనగామ టికెట్‌ ఎవరికనేదానిపై ఆఖరి నిమిషం వరకూ ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేరు లేకపోవడం తెలిసిందే. ముత్తిరెడ్డిని బుజ్జగించి పల్లాకు టికెట్‌ ఇచ్చారు కేసీఆర్. మరో వైపు కాంగ్రెస్‌ నుంచి పొన్నాల బీఆర్‌ఎస్‌లో చేరడంతో టికెట్‌పై చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది. చివరికి పల్లాకే టికెట్‌ ఇవ్వడంతో గత కొంతకాలంగా ఈ విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది.

కాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలుసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనగామ అసెంబ్లీ నియోజకవర్గంపై అందరి ఫోకస్ నెలకొంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించి, డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..

Published on: Oct 15, 2023 06:19 PM