CM KCR: దత్తత గ్రామం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్.. దళిత వాడలో ప్రతి ఇంటిని పరిశీలించిన సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశే‌ఖ‌ర్‌‌రావు తన దత్తత గ్రామం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా తుర్కపల్లి మండ‌లం‌లోని వాసా‌ల‌మ‌ర్రిలో పర్యటించారు.

CM KCR: దత్తత గ్రామం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్.. దళిత వాడలో ప్రతి ఇంటిని పరిశీలించిన సీఎం
Cm Kcr
Follow us

|

Updated on: Aug 04, 2021 | 1:33 PM

CM KCR Vasalamarri visit: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశే‌ఖ‌ర్‌‌రావు తన దత్తత గ్రామం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా తుర్కపల్లి మండ‌లం‌లోని వాసా‌ల‌మ‌ర్రిలో పర్యటించారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో వాసాల‌మ‌ర్రికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ద‌ళితవాడ‌లో అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ పరిశీలించారు. వార్డుల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్పన‌తో పాటు ద‌ళితుల‌ స్థితిగ‌తుల‌ను అడిగి తెలుసుకున్నారు. ద‌ళిత‌వాడ‌లో ప‌ర్యట‌న ముగిసిన అనంత‌రం.. గ్రామ‌మంతా క‌లియ తిరుగుతూ పారిశుద్ధ్య చ‌ర్యల‌ను ప‌రిశీలించారు.

అనం‌తరం రైతు వేదిక భవ‌నంలో ఏర్పా‌టు‌చే‌సిన సమా‌వే‌శంలో గ్రామా‌భి‌వృ‌ద్ధిపై స్థానికులతో చర్చిం‌చ‌ను‌న్నారు. గత నెలలలో వాసాలమర్రి పర్యటన సంద‌ర్భంగా తాను ఇచ్చిన హామీల అమ‌లు‌తీ‌రుపై ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ అధికారులతో సమీ‌క్షిం‌చ‌నున్నారు. తదు‌పరి చేప‌ట్టా‌ల్సిన కార్యా‌చ‌ర‌ణపై ప్రజా‌ప్రతి‌ని‌ధులు, అధి‌కా‌రులు, ప్రజ‌లకు దిశా‌ని‌ర్దేశం చేస్తారు సీఎం. వాసాల‌మ‌ర్రి గ్రామా‌నికి సీఎం కేసీ‌ఆర్‌ రావడం ఇది రెండో‌సారి. కాగా, గత జూన్‌ 22న తొలి‌సా‌రిగా వాసా‌ల‌మ‌ర్రికి వచ్చిన ముఖ్య‌మంత్రి.. గ్రామ‌స్థు‌లతో కలిసి గ్రామా‌భి‌వృ‌ద్ధిపై చర్చించి అనం‌తరం సహ‌పంక్తి భోజనం చేశారు. 42 రోజుల తర్వాత సీఎం మరో‌సారి గ్రామా‌నికి వ‌చ్చారు.

Read Also…

Krishna Water: జల వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం వద్దన్న ఏపీ.. పిటిషన్‌ మరో బెంచ్‌కు బదిలీ చేసిన చీఫ్ జస్టిస్

పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?