Munugode-Bypoll: మునుగోడులో ఫైనల్ కౌంట్ తేలింది.. ఓటర్ల తుది జాబితా ఇదే.. టోటల్ ఓటర్ల సంఖ్య ఎంతంటే..

మునుగోడులో ఫైనల్ కౌంట్ తేలింది. ఇక్కడ ఏక్‌ దిన్ కా సుల్తాన్‌లు ఎంతమంది..? మునుగోడులో ఓటుహక్కు సంపాదించి జాక్‌పాట్ కొడతామని ఆశపడి.. ఆ తర్వాత భంగవడ్డవాళ్లు ఎంతమంది..

Munugode-Bypoll: మునుగోడులో ఫైనల్ కౌంట్ తేలింది.. ఓటర్ల తుది జాబితా ఇదే.. టోటల్ ఓటర్ల సంఖ్య ఎంతంటే..
Munugode
Follow us

|

Updated on: Oct 16, 2022 | 7:52 AM

మునుగుడు లెక్క తేల్చింది ఈసీ. 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్నవారితో కలిపి.. మునుగోడులో టోటల్ ఓటర్ల సంఖ్య 2 లక్షల 41 వేల 795. వీరిలో పురుషులు లక్షా 21 వేల 662 మంది. మహిళలు లక్షా 20 వేల 126 మంది. ఏడుగురు ట్రాన్స్‌జెండర్లు. జనవరి 1న ప్రకటించిన జాబితాలో 2 లక్షల 26 వేల 471 మంది ఓటర్లుంటే.. కొత్తగా ఓటుహక్కు కోసం 26,742 మంది అప్లయ్ చేసుకున్నారు. వీరిలో 10 వేల 792 మందిని అనర్హులుగా తేల్చారు. టోటల్‌గా మునుగోడులో కొత్తగా ఓటు హక్కు పొందిన అదృష్టవంతుల సంఖ్య 15 వేల 980గా తేలింది. ఈ ఫైనల్ జాబితా ప్రకటనకు ముందు మునుగోడు ఎలక్టోరల్ లిస్టుపై పెద్ద తతంగమే జరిగింది. నోటిఫికేషన్‌ వెలువడుతుందన్న వార్తల నేపథ్యంలో అతితక్కువ సమయంలో ఓటుహక్కు కోసం పాతికవేలకుపైగా దరఖాస్తులొచ్చాయి.

దీంతో ఓటర్ల నమోదులో అక్రమాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేస్తే.. బీజేపీ నేరుగా కోర్టు మెట్లే ఎక్కేసింది. జూలై31 వరకు ఉన్న జాబితానే లెక్కలోకి తీసుకుంటూ ఎన్నికల అధికారులకు ఆదేశాలివ్వాలని, ఆ విధంగా తప్పుడు ఓటర్లను అడ్డుకోవాలని కోరింది.

హైకోర్టు ఆదేశాల మేరకు కొత్త ఓటర్ల రిజిస్ట్రేషన్‌పై క్లారిఫికేషన్ ఇచ్చారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. పెండింగ్‌లో ఉన్న ఫామ్ సిక్స్‌లన్నిటినీ యుద్ధప్రాతిపదికన ఒకేఒక్క రోజులో జల్లెడ పట్టి.. సగానికి సగం బోగస్ అని తేల్చేసింది. మరుసటిరోజే మిగతా వాళ్లను ఒరిజినల్ ఓటర్లుగా ప్రకటించారు. టోటల్‌గా 10 వేల 792 మంది మునుగోడులో ఓటు హక్కు దొరక్క.. నిరాశపడ్డారు. మునుగోడులో ఓటర్లు అసాధారణ స్థాయిలో పెరిగినట్లు కనిపించడం లేదని, తుది జాబితాపై సందేహాలుంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్‌ను డైరెక్ట్ చేసింది ధర్మాసనం. తదుపరి విచారణ ఈనెల 21న జరగనుంది. ఈలెక్కన.. మునుగోడు కొత్త ఓటర్ల కాంట్రవర్సీ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.

అటు.. మునుగోడు బరిలో మిగిలేదెవరన్న లెక్క దాదాపుగా తేలిపోయింది. మొత్తం 130 మంది అభ్యర్థుల నామినేషన్లను స్క్రూటినీ చేసిన అధికారులు.. 47 నామినేషన్లను తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు రేపటితో ముగుస్తుంది. మిగతా 83 మందిలో ఎవరు నిలబడతారు.. ఎవరు తప్పుకుంటారు అనే సస్పెన్స్ కొనసాగుతోంది. నవంబర్3న జరిగే మునుగోడు ఉపఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి మూడు ప్రధాన పార్టీలు.

మరిన్ని మునుగోడు వార్తల కోసం