Telangana Census 2027: తెలంగాణలో జనాభా లెక్కల సేకరణకు ముహూర్తం ఫిక్స్.. ఈ తేదీలు మర్చిపోవద్దు..

తెలంగాణ ప్రభుత్వం 2027 జనగణన తేదీలను ఖరారు చేసింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ప్రజలకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కోసం జనవరి 10 నుంచి 24 వరకు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి జీవో నెం.155ను ప్రభుత్వం విడుదల చేసింది.

Telangana Census 2027: తెలంగాణలో జనాభా లెక్కల సేకరణకు ముహూర్తం ఫిక్స్.. ఈ తేదీలు మర్చిపోవద్దు..
Telangana Census

Updated on: Nov 09, 2026 | 6:21 PM

తెలంగాణలో జనగణన–2027 షెడ్యూల్ ఖరారు అయింది. తెలంగాణలో 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా గణన జరగనుంది. జనవరి 10 నుంచి 24 వరకు స్వీయ జనగణనకు అవకాశం కల్పించనున్నారు. మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ నిర్వహణ జరగనుండగా.. 2027 మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలను జనగణనకు ప్రామాణిక తేదీగా నిర్ణయించారు. జనగణన తేదీలపై కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం పున ప్రచురణ చేసింది. జీఓ నంబర్ 155 తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. అక్టోబర్ 30న కేంద్ర ప్రభుత్వం 2027 జనగణనకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేయగా.. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జనవరి 25 నుంచి ఇంటింటి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుంది. ఈ తేదీల మధ్య సిబ్బంది ప్రతి ఇంటినీ సందర్శించి కుటుంబాల, వ్యక్తుల వివరాలను నమోదు చేసుకుంటారు.

ఈసారి జనగణనలో ప్రజలకు ముఖ్యమైన అవకాశం కల్పించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంలో ప్రజలే స్వయంగా ఆన్లైన్ ద్వారా తమ వివరాలు అందించవచ్చు. ఈ ప్రక్రియ జనవరి 10, 2027న ప్రారంభమై జనవరి 24, 2027 వరకు కొనసాగనుంది. పౌరులు తమ వివరాలను ఆన్‌లైన్ లేదా ఇతర మార్గాల ద్వారా నమోదు చేసుకోవచ్చు.  జనగణన ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక మార్చి 1, 2027 నుండి మార్చి 5, 2027 వరకు సవరణ కార్యక్రమం ఉంటుంది. అంటే డేటాలో ఏవైనా లోపాలు లేదా మార్పులు ఉంటే వాటిని సరిదిద్దుకోవచ్చు. జనగణనకు ప్రామాణిక సమయంగా మార్చి 1, 2027 అర్ధరాత్రి 12:00 గంటలను ప్రభుత్వం నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయానికి రాష్ట్రంలో నివసిస్తున్న జనాభాను పరిగణనలోకి తీసుకుని గణాంకాలను సేకరిస్తారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ జనగణన రాష్ట్ర ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలకు కీలకమైన డేటాను అందింనుంది. జనాభా స్వరూపం, విద్యా స్థాయి, ఆర్థిక స్థితిగతులు వంటి అనేక ముఖ్యమైన సమాచారం ఈ జనగణన ద్వారా లభించనుంది. ఇది భవిష్యత్  అవసరాల కోసం ఉయోగపడనుంది. ప్రజలందరూ ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us