జనగామలో దారుణం.. మూఢనమ్మకంతో మంటగలిసిన మానవత్వం!

జనగామ జిల్లాలో మానవత్వం మంటగలిపే సంఘటన చోటుచేసుకుంది. సభ్య సమాజం సిగ్గుపడే ఘోరమిది. హృదయాల్ని కలచివేసే విషాదమిది. బతికున్నప్పుడే కక్షలతో ఎంతకైనా తెగిస్తున్న ఈ రోజుల్లో మనిషి చనిపోయిన తరువాత కూడా తమ నీచపు బుద్ధులు చూపిస్తున్నారు కొందరు నీచులు. మూఢనమ్మకాలతో మానవత్వాన్ని మరిచిపోతున్నారు. అద్దెకు ఉండే వ్యక్తి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకొచ్చేందుకు ఆ యజమాని అంగీకరించలేదు.  కొత్తకొండ రాజన్న బతుకుతెరువు కోసం కొన్నేళ్ళకింద జనగామ జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్ కు వచ్చి ఓ ఇంట్లో అద్దెకు […]

జనగామలో దారుణం.. మూఢనమ్మకంతో మంటగలిసిన మానవత్వం!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 21, 2019 | 5:32 PM

జనగామ జిల్లాలో మానవత్వం మంటగలిపే సంఘటన చోటుచేసుకుంది. సభ్య సమాజం సిగ్గుపడే ఘోరమిది. హృదయాల్ని కలచివేసే విషాదమిది. బతికున్నప్పుడే కక్షలతో ఎంతకైనా తెగిస్తున్న ఈ రోజుల్లో మనిషి చనిపోయిన తరువాత కూడా తమ నీచపు బుద్ధులు చూపిస్తున్నారు కొందరు నీచులు. మూఢనమ్మకాలతో మానవత్వాన్ని మరిచిపోతున్నారు.

అద్దెకు ఉండే వ్యక్తి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకొచ్చేందుకు ఆ యజమాని అంగీకరించలేదు.  కొత్తకొండ రాజన్న బతుకుతెరువు కోసం కొన్నేళ్ళకింద జనగామ జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్ కు వచ్చి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. పొట్టకూటి కోసం దేవాలయం దగ్గర కొబ్బరికాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే షాపులో నిద్రిస్తున్న సమయంలోనే అక్కడికక్కడే అతని ప్రాణాలు పోయాయి. అయితే అతని మృతదేహాన్ని అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకువెళ్తే ఆ యజమాని తిరస్కరించాడు. మూఢనమ్మకాలతో మృతదేహాన్ని తన ఇంటికి తీసుకురావొద్దని ఖరాఖండిగా చెప్పేశాడు. బంధువుల ఇంటికి తీసుకెళ్లగా అక్కడ కూడా చేదు అనుభవం ఎదురైంది. చీకటిపడుతుండడంతో ఇక చేసేదేమీ లేక రాజన్న మృత దేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అక్కడే మృతదేహాన్ని ఉంచి రాత్రంతా వేచిచూశారు స్థానికులు. ఉదయం హైదరాబాద్ లో ఉంటున్న కొడుకు బంధువులు వచ్చేవరకు చూసి సాయంత్రం రాజన్న మృతదేహాన్ని ఖననం చేశారు. ఆ ఇంటి యజమానిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు స్థానికులు.