అర్ధరాత్రి ఫోన్ చేసి బ‌య‌ట‌కు పిలిచారు.. పక్కా ప్లాన్‌తో ఏం చేశారంటే..

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ హత్య చోటుచేసుకుంది. సింగరేణి సంస్థ ఉద్యోగి రాజశేఖర్ (30)ను అర్ధరాత్రి ఫోన్ చేసి ఇంటి నుంచి బయటకు రప్పించిన దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. పవర్‌హౌస్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నలుగురు యువకులు ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

అర్ధరాత్రి ఫోన్ చేసి బ‌య‌ట‌కు పిలిచారు.. పక్కా ప్లాన్‌తో ఏం చేశారంటే..
Godavarikhani Murder

Updated on: Nov 23, 2026 | 10:21 AM

గోదావరిఖని (పెద్దపల్లి జిల్లా): స‌మ‌యం అర్థ‌రాత్రి.. అంతా గాఢ నిద్ర‌లో ఉన్నారు.. ఈ స‌మ‌యంలోనే ఫోన్ వ‌చ్చింది.. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లాడు.. అంతే.. అక్క‌డ మాటు వేసిన కొంత‌మంది క‌లిసి దారుణ హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న పెద్ద‌ప‌ల్లి జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి సంస్థ ఉద్యోగి రాజశేఖర్ (30) దారుణ హత్యకు గురయ్యాడు. పవర్‌హౌస్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ముందుగా వేసుకున్న పథకం ప్రకారం..  కొందరు యువకులు రాజశేఖర్‌కు ఫోన్ చేసి నివాసం నుంచి బయటకు రప్పించారు. అనంతరం అతనిపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నలుగురు యువకులు ఈ దాడి చేసిన‌ట్లు పేర్కొంటున్నారు.

సమాచారం అందుకున్న గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us