Apsara Murder: ‘అప్సర గర్భం సాయికృష్ణ వల్ల కాదు, మా ఆయన మంచోడు’.. టీవీ9తో సాయికృష్ణ భార్య సంచలన వ్యాఖ్యలు

శంషాబాద్‌ పరిధిలో జరిగిన అప్సర అనే యువతి హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆలయంలో పూజలు చేసే ఓ పూజారి మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడన్న వార్త అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ప్రస్తుతం అప్సర మృతదేహం ఉస్మానియా..

Apsara Murder: 'అప్సర గర్భం సాయికృష్ణ వల్ల కాదు, మా ఆయన మంచోడు'.. టీవీ9తో సాయికృష్ణ భార్య సంచలన వ్యాఖ్యలు
Apsara Murder
Follow us

|

Updated on: Jun 10, 2023 | 10:24 AM

శంషాబాద్‌ పరిధిలో జరిగిన అప్సర అనే యువతి హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆలయంలో పూజలు చేసే ఓ పూజారి మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడన్న వార్త అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ప్రస్తుతం అప్సర మృతదేహం ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురిలో ఉంచారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే అప్సర హత్య కేసులో నిందితుడు సాయికృష్ణను రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్‌ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ని విధించింది.

ఇదిలా ఉంటే అప్సర హత్య కేసులో తన భర్తను కావాలనే ఇరికిచ్చారని సాయికృష్ణ భార్య శ్రావ్య ఆరోపించారు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ..’అప్సర హత్య యాక్సిడెంటల్‌గా జరిగి ఉండొచ్చు. ఆ అమ్మాయి టార్చర్‌ వల్లే ఈ ఘటన జరిగింది. నా భర్త హత్య చేసేంత దుర్మార్గుడు కాదు. అప్సరతో మాట్లాడతాడు కాని రిలేషన్‌ లేదు. అప్సర గర్భం సాయికృష్ణ వల్ల రాకపోయి ఉండొచ్చు. మా ఇంట్లో పూజకు కూడా అప్సర వచ్చింది. అప్పుడప్పుడు లేట్‌నైట్‌ వస్తుంటారు, అది పనిలోనే వెళ్తారు’ అని చెప్పుకొచ్చింది.

‘అప్సరను ఓసారి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు నాతో చెప్పాడు. ఆయన మంచితనం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఆయన ఎవరినైనా రిలేషన్‌తోనే పిలుస్తారు. గుడిలో ఫ్రెండ్స్‌ సమూహం ఉండేది. వారిలో అప్సర కూడా ఉండొచ్చు’అని తెలిపింది. ఇక అప్సర అర్థరాత్రుళ్లు వస్తుంటే కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారని శ్రావ్య ఆరోపించారు. అప్సరతో కలిసి తిరుగుతుంటే వారి అమ్మ ఏం చేస్తోందని ప్రశ్నించింది. ఓ కూతురున్న వ్యక్తితో అప్సర ఎలా తిరిగింది అంటూ సాయికృష్ణ ఎదురు ప్రశ్నలు సంధించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..