
తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్. రైతు భరోసా నిధులను రేవంత్ సర్కార్ ఇవాళ విడుదల చేసింది. ఈ మేరకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన రైతు భరోసా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నిధులు విడుదల చేశారు. వానాకాలం సీజన్ కోసం రైతు భరోసా నిధులను బటన్ నొక్కి రిలీజ్ చేశారు. జూన్ 30న రెండు ఎకరాల్లోపు పోలం ఉన్న రైతుల అకౌంట్లో డబ్బులు పడనున్నాయి. విడదల వారీగా అందరి రైతులకు అందించనున్నారు. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున అకౌంట్లలో వేయనున్నారు. మొత్తం 73.32 లక్షల మంది రైతులకు అందించనుండగా.. ఇవాళ 2 ఎకరాల్లోపు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతులకు అకౌంట్లలో పడనుంది.
-https://rythubharosa.telangana.gov.in వెబ్ సైట్ సందర్శించండి
-హోమ్ పేజీలో ‘Beneficiary Status’ లేదా ‘Payment Status’ అనే ఆప్షన్ ఎంచుకోండి
-ఆధార్ నెంబర్ లేదా పట్టాదారు పాస్ బుక్ నెంటర్ నమోదు చేయండి
-సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి
-మీకు డబ్బులు పడ్డాయా లేదా.. ఏ అకౌంట్లో పడ్డాయి.. ఎన్ని డబ్బులు పడ్డాయి అనే వివరాలు కనిపిస్తాయి
స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు పడనట్లయితే.. మీ పట్టాదారు పాస్ బుక్, భూమి వివరాలు చెక్ చేసుకోవాలి. మీ మండలం పరిధిలోని గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి. లేదా మండల వ్యవసాయ అధికారిని కూడా సంప్రదించవచ్చు. డబ్బులు పడకపోవడానికి గల కారణం తెలుసుకోండి. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని పరిష్కరించుకోండి. పట్టాదారు పాస్ బుక్ లో, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లో పేరు ఒకేలా ఉందా.. లేదా అనేది చెక్ చేస్కోండి. పేరు తప్పుగా ఉంటే డబ్బులు ఆగిపోయే అవకాశముంది. ఇక ఆధార్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వంటివి లింక్ అయ్యారా లేదా అనేది చెక్ చేస్కోండి. సాంకేతిక సమస్యల వల్ల నగదు జమకాని రైతులు బ్యాంకు ఖాతాల నంబర్లతో పాటు ఐఎఫ్ఎస్సీ కోడ్ నంబర్లను సరిచేసుకోవాలని