Rowdy Sheeter: తన నేరమే తన ప్రాణం తీసింది.. ఓల్డ్ సిటీలో రౌడీషీటర్ దారుణ హత్య.. కారణం ఇదే..

| Edited By: Srikar T

Dec 22, 2023 | 5:11 PM

పేద ప్రజల్ని వేధించి వ్యాపారవేతల్ని బ్లాక్మెయిల్ చేయడం అమాయకుల్ని పై దాడులు చేసి డబ్బులు లాక్కోవడం మృతుడి వృత్తి. వేధింపులు భరించ లేక ప్రజలు అతని ఇంట్లో వారికి ఫిర్యాదులు చేశారు. ప్రజా ప్రతినిధికి కంప్లైంట్లు ఇచ్చారు. ఫలితం దక్కకపోవడంతో చేసేదేమీ లేక అత్యంత దారుణంగా హత్య చేసి చంపేసిన ఘటనలో నిందితులని పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు.

Rowdy Sheeter: తన నేరమే తన ప్రాణం తీసింది.. ఓల్డ్ సిటీలో రౌడీషీటర్ దారుణ హత్య.. కారణం ఇదే..
Rowdy Sheeter
Follow us on

పేద ప్రజల్ని వేధించి వ్యాపారవేతల్ని బ్లాక్మెయిల్ చేయడం అమాయకులపై దాడులు చేసి డబ్బులు లాక్కోవడం మృతుడి వృత్తి. వేధింపులు భరించలేక ప్రజలు అతని ఇంట్లో వారికి ఫిర్యాదులు చేశారు. ప్రజా ప్రతినిధికి కంప్లైంట్లు ఇచ్చారు. ఫలితం దక్కకపోవడంతో చేసేదేమీ లేక అత్యంత దారుణంగా హత్య చేసి చంపేసిన ఘటనలో నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‎కు తరలించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీటిని చూసిన ప్రజలు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ ఘటన వెనుక మృతుడు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఈ నెల19 తెల్లవారు జామున ఐ ఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రౌడీ షీటర్ మహమ్మద్ తారిక్ అలీ(39)తో పాటు ఈ హత్య కేసులో మరో 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు.

నిందితుల నుంచి నాలుగు కత్తులు.. ఐదు సెల్ ఫోన్లు.. మూడు బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు పోలీసులు. ఐ ఎస్ సదన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఈ కేసు వివరాలను సౌత్ ఈస్ట్ డీసీపీ రోహిత్ రాజ్ వెల్లడించారు. స్థానికంగా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న నిందితులను మృతుడు తారిక్ అలీ ప్రతి నెల లక్ష రూపాయలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిపారు. ఇవ్వకుంటే పోలీసులకు పట్టించి వ్యాపారాలు మూసివేయిస్తానని బెదిరించినట్లు వివరించారు. అంతేకాకుండా అక్టోబర్ నెలలో కర్మన్ ఘాట్‎లోని సామ బార్‎లో ఒక గొడవ జరిగింది. ఈ గొడవలో మధ్యవర్తిగా మృతుడు వ్యవరించారు. అవతలి వ్యక్తులకు రెండు లక్షలు నష్ట పరిహారం ఇచ్చే విధంగా రాజీ కుదిర్చారు. ఇలా రాజీ కుదిర్చిన నగదును అవతలి వ్యక్తులకు ఇవ్వకుండా అతడి వద్ద ఉంచుకొని సాకులు చెప్ప సాగాడు. దీంతో నిందితులు చోటూ‌, ముబీన్, కలీం,ఫర్హాజ్,ఆమేర్, ఖలీద్‎లు పథకం ప్రకారం ఇంటి ముందు ఉన్న తారిక్ అలీ పై దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు డీసీపీ తెలిపారు. ఈ సమావేశంలో ఆదనపు డీసీపీ మనోహర్, ఏసీపీ మహమ్మద్ గౌస్, ఇన్స్పెక్టర్ మల్లేష్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..