BRS: రేణుకా చౌదరి, పొంగులేటిలపై మంత్రి పువ్వాడ అజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. కాకరేపుతున్న ఆత్మీయ సమ్మేళనాలు..

ఖమ్మం జిల్లా...రఘునాథ పాలెం లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ రేణుకా చౌదరి, పొంగులేటిపై చేసిన హాట్‌కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి.

BRS: రేణుకా చౌదరి, పొంగులేటిలపై మంత్రి పువ్వాడ అజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. కాకరేపుతున్న  ఆత్మీయ సమ్మేళనాలు..
Puvvada Ajay Kumar
Follow us

|

Updated on: May 07, 2023 | 10:05 PM

ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు కాకరేపుతున్నాయి. రఘునాథపాలెంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ కాంగ్రెస్‌ నేత రేణుకా చౌదరి, పొంగులేటిలపై పరోక్ష విమర్శలు చేశారు. నిన్నటి వరకు కేసీఆర్ తో ఉండి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దొబ్బాడంటూ పొంగులేటిపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అయనకేదో కడుపునొప్పి వచ్చినదని ఆయన కడుపునొప్పిని మీ తలనొప్పిని చేయాలని చూస్తున్నాడంటూ మండిపడ్డారు. నేను రాజకీయాల్లోకి వచ్చి పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాల్లో నేను పోగొట్టుకుందే తప్ప తెచ్చుకున్నది ఏమీలేదన్నారు మంత్రి పువ్వాడ అజయ్‌. ఇక్కడ ఎవరూ పర్మినెంట్ కాదు..ఎవరూ వందేళ్లు ఉండరన్న పువ్వాడ… మీరు మళ్ళీ దీవిస్తే రెండు సార్లు ఉంటానన్నారు.

నేను ఉన్నా లేకపోయినా నేను చేసిన పనులు జీవితకాలం మిగిలిపోతాయనీ, గతంలో కేంద్ర మంత్రులుగా ఎంపీలుగా పనిచేసిన వారు జిల్లాకి చేసిన అభివృద్ధి ఏమీలేదన్నారు మంత్రి. గుట్టలు ఖాళీ చేస్తున్నామని అంటున్నారు…కానీ ఆ మట్టిని నేషనల్ హైవే రోడ్డుకు వాడుతున్నారని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాదు…గుట్టల కింద కాళీ అయిన స్థలాన్ని ఇక్కడ పేదవారికి ఇళ్ల స్థలాలుగా ఇస్తామన్నారు. చిల్లర మాటలు మాట్లాడే వారి నోరు మూయిస్తానంటూ పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం