Sabitha Indra Reddy: మంత్రిగారు ఇదేం టైమింగ్‌.. స్కూల్‌ హాలిడేస్‌పై పేరెంట్స్‌ రియాక్షన్‌ ఇదే

| Edited By: Basha Shek

Jul 20, 2023 | 10:11 AM

తెలంగాణలో పడుతున్న భారీ వర్షాల కారణంగా రెండు రోజులపాటు తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవుని ప్రకటించింది. రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్ కి హాలిడేస్ ని ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొద్దిసేపటికి ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు

Sabitha Indra Reddy: మంత్రిగారు ఇదేం టైమింగ్‌.. స్కూల్‌ హాలిడేస్‌పై పేరెంట్స్‌ రియాక్షన్‌ ఇదే
Sabitha Indra Reddy
Follow us on

తెలంగాణలో పడుతున్న భారీ వర్షాల కారణంగా రెండు రోజులపాటు తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవుని ప్రకటించింది. రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్ కి హాలిడేస్ ని ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొద్దిసేపటికి ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. కానీ మంత్రి సబితా ట్వీట్ కు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున స్పందించారు . స్కూల్ ఏడు గంటలకి ప్రారంభమైతే 9 గంటలకు సెలవు ప్రకటించడం ఏంటని ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ మంత్రి సబితకి ట్వీట్లు చేస్తున్నారు . చాలామంది విద్యార్థులు ఇప్పటికే వర్షంలో తడుస్తూ స్కూల్ కి వెళ్లారని తీరిగ్గా 9 గంటలకు ట్వీట్ చేసి సబిత విమర్శకుల పాలయ్యారు . దీంతో ట్విట్టర్లో పెద్ద ఎత్తున ఆమెను విమర్శిస్తూ పోస్టులు షేర్‌ చేస్తున్నారు. 7:30 కి స్కూల్ స్టార్ట్ అయి వర్షంలో తడుచుకుంటూ వెళ్లి తమంత విద్యార్థులు దింపి వచ్చామని ఇప్పుడు మీరు సెలవులు ప్రకటిస్తే ఏం లాభం అంటూ చాలామంది మంత్రిని ట్రోల్ చేస్తున్నారు. వర్షాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ముందు జాగ్రత్తలు లేవని పేరెంట్స్‌ విమర్శలు చేస్తున్నారు.

కాగా అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా ఎడతెరిపిలేని వానలతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇక హైదరాబాద్‌లో మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలోనే పాఠశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..