కూతురి పెళ్లి చేసి ఇంటికొచ్చిన తండ్రి.. తెల్లారేసరికే ఊహించని విషాదం.. ఏం జరిగిందంటే?

కూతురి పెళ్లి జరిగి 24 గంటలు కూడా కాలేదు.. ఇంట్లో బంధువల సందడి, చిన్నారుల కిలకిల నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇంతలోనే ఓ వార్త అందరి ఆనందాన్ని చిదిమేసింది. బిడ్డ పెళ్లి చేసిన ఆనందం ఆ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండలేక పోయింది. కన్న కూతురు పెళ్లి చేసిన రోజే తండ్రి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

కూతురి పెళ్లి చేసి ఇంటికొచ్చిన తండ్రి.. తెల్లారేసరికే ఊహించని విషాదం.. ఏం జరిగిందంటే?
Daughter Wedding Suicide

Edited By:

Updated on: Apr 28, 2026 | 6:04 PM

నిజామాబాద్ జిల్లా నం దిగామలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కూతురి పెళ్లి జరిగిన రోజే ఓ తండ్రి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. నందిగామకు చెందిన ఎల్కా దేవన్న(51)కు కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో చిన్న కుమారుడు మానసిక వికలాంగుడు. అయితే ఆదివారం తన కూతురును కామారెడ్డి జిల్లా నస్రు ల్లాబాద్ మండలం అంకోల్‌కు చెందిన యువకుడి ఇచ్చి వివాహం జరిపించారు దేవన్న. పెళ్లి తంతు పూర్తైన తర్వాత సాయంత్రానికి కుటుంబ సభ్యులు, బంధువులతో దేవన్న స్వగ్రామానికి చేరుకున్నారు.

అయితే వృత్తిరిత్యా మేకలు కాస్తూ జీవనం సాగించే దేవన్న కూతురు పెళ్లి కోసం డబ్బులు సరిపోకపోవడంతో తన దగ్గర ఉన్న 130 మేకల్లో 30 మేకలను అమ్మేశాడు. దీనికి తోడు ఇటేవలే ఎండదెబ్బ కారణంగా మరో ఆరు మేకలు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని మేకలను దొంగలెత్తుకెళ్లారు. ఇక కూతురి పెళ్లి చేసి ఇంటికొచ్చిన దేవన్నకు మేకల మంద చిన్నగా కనిపించడంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

నేరుగా ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే కొత్తగా పెళ్లి చేసుకున్న కూతురు, అల్లుడు రాత్రి ఇంటికి చేరుకోగా.. ఇంట్లో దేవన్న విగతజీవిగా పడిఉన్నాడు. అది చూసిన కూతురు, అల్లుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులు సైతం షాక్ అయ్యారు. పెళ్లిరోజే కన్న తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కూమార్తె కన్నీరుమున్నీరుగా విలపించారు. కష్టపడి పెంచుకున్న మేకలు లేవనే మనస్తాపంలో దేవన్న ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us