Telangana: సీనియారిటీ వ‌ర్సెస్ స‌ర్వే రిపోర్ట్.. ఆ నియోజకవర్గంలో తేలని టికెట్ పంచాయితీ..

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‎లో ఇప్పుడు ఎంపి టికేట్ వార్ న‌డుస్తుంది. స‌ర్వేల ఆధారంగా వెళ్లాలని కొంద‌రు అంటుంటే సీనియారిటీకి పెద్ద పీట వేయాల‌ని కోందరు ప‌ట్టుప‌డుతున్నారు. ఇప్పుడు ఏటు తేల‌కూండా పోయింది నిజామాబాద్ ఎంపీ టికెట్. కాంగ్రెస్ రెండు లిస్ట్‎ల‌ను ప్రక‌టించిన ఇప్పటికీ నిజామాబాద్‎పై క్లారిటీ లేక‌పోవ‌డానికి కార‌ణం అదే అంటున్నారు నాయకులు.

Telangana: సీనియారిటీ వ‌ర్సెస్ స‌ర్వే రిపోర్ట్.. ఆ నియోజకవర్గంలో తేలని టికెట్ పంచాయితీ..
Telangana Congress
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 22, 2024 | 1:25 PM

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‎లో ఇప్పుడు ఎంపి టికేట్ వార్ న‌డుస్తుంది. స‌ర్వేల ఆధారంగా వెళ్లాలని కొంద‌రు అంటుంటే సీనియారిటీకి పెద్ద పీట వేయాల‌ని కోందరు ప‌ట్టుప‌డుతున్నారు. ఇప్పుడు ఏటు తేల‌కూండా పోయింది నిజామాబాద్ ఎంపీ టికెట్. కాంగ్రెస్ రెండు లిస్ట్‎ల‌ను ప్రక‌టించిన ఇప్పటికీ నిజామాబాద్‎పై క్లారిటీ లేక‌పోవ‌డానికి కార‌ణం అదే అంటున్నారు నాయకులు. జూనియ‌ర్ వ‌ర్సెస్ సీనియ‌ర్‎లో ప‌ట్టు ఎవ‌రికి.. జిల్లా నేత‌ల మ‌ద్దతు ఎవ‌రికి.. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంపిక ఇప్పుడు.. పార్టీ అధిష్టానానికి ఇప్పుడు పెద్ద టాస్క్‎గా మారింది. రెండు సార్లు సీఈసీ మీటింగ్ జరిగినా నిజామాబాద్ అభ్యర్థిత్వంపై క్లారిటి రాలేదు. రెండో లిస్ట్‎లో ఎక్స్పెక్ట్ చేసిన రెండో లిస్ట్‎లో నిజామాబాద్ లేక‌పోవ‌డంతో ఉత్కంఠ రోజురోజు‎కు పెరుగిపోతుంది. ఇక ఇప్పటికే ప‌లు పేర్లు వినిపించినప్పటికీ వారి విష‌యంలో క్లారిటికి రాలేక‌పోతుంది కాంగ్రెస్ అధిష్టానం.

కోలిక్కి వ‌చ్చేనా..?

ఇక నిజామాబాద్ పార్లమెంట్ బ‌రిలో నిలిచేందుకు పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జిల్లాలోని సీనియ‌ర్ నేత‌లు మాకంటే మాకు అంటూ పార్లమెంట్‎పై ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ రెండు మూడు రోజుల క్రిత‌మే ఆశావాహులుగా ఉన్నా డిసిసి అధ్యక్షుడు మానాల మోహ‌న్ రెడ్డి, మాజీ విప్ ఈర‌వ‌త్రి అనిల్ ఇద్దరితో పాటు మ‌రికొంద‌రికి కార్పోరేష‌న్ ప‌ద‌వులు వ‌రించాయి. దీంతో ఇప్పుడు రేసులో ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి, బాల్కోండ నుండి బ‌రిలోకి దిగిన ముత్యాల సునీల్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి విష‌యంలో ఎవరిని ఫైన‌ల్ చేయాలి అనే అంశం‎పై త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట కాంగ్రెస్ పెద్దలు.

స‌ర్వే ఆధారంగానే టికేట్ల కేటాయింపు..

ఇక అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అభ్యర్థుల విష‌యంలో తీసుకున్న పార్ములానే ఇప్పుడు కూడ పాటించాల‌ని భావిస్తుంద‌ట కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పూర్తిగా స‌ర్వేల ఆధారంగానే అభ్యర్థుల‌ను ఎంపిక చేసింది. ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో ముందుకు వెళ్లాలని భావిస్తుంద‌ట. ఇక ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్‎ కోసం చేసిన స‌ర్వేల్లో సునీల్ రెడ్డి ముంద‌జ‌లో ఉండ‌టం, అటు సానుభూతి కూడా కలిసిరావడంతో సునీల్ క‌నుగోలు టీం సునీల్ రెడ్డి వైపు ఎక్కువ మద్దతు చూపుతోందట. అటు ప్రత్యర్థిగా ఉన్న అర్వీంద్‎ను ఢీ కొట్టాలంటే యువ‌కుల‌కు అవ‌కాశం ఇస్తేనే భాగుంటుంద‌ని ఆలోచిస్తున్నార‌ట. ఇదే విష‌యాన్ని గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటి చేసిన అభ్యర్థులంద‌రు సీఎం రేవంత్‎కు కూడ చేప్పార‌ట. ఇక అటు జీవ‌న్ రెడ్డి కూడా సీనియ‌ర్ కావ‌డం, పోటీ విష‌యంలో ఎక్కడా త‌గ్గడం లేద‌ట. జీవ‌న్ రెడ్డికి జిల్లా నుండి కేవ‌లం సుద‌ర్శన్ రెడ్డి ఒక్కరు త‌ప్ప మిగితా ఎవ‌రు స‌పోర్ట్ చేయ‌డం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఇద్దరి మ‌ధ్య టికెట్ రేస్ ఇప్పుడు జిల్లా కాంగ్రెస్‎లో కోల్డ్ వార్‎గా మారింది. గెలిచే సీటును పంతానికి పోయి ఓడించోద్దంటున్నారట కొందరు నేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..