పోలీసులపై దాడి కేసులో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. వాదనలు విన్న నాంపల్లి కోర్టు మంగళవారం ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా.. నిరుద్యోగ సమస్యపై హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర దీక్షకు సిద్ధమైన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. షర్మిల ఇందిరా పార్క్ దగ్గరకు వెళ్తుండగా.. ఆమెను ఇంటిదగ్గరే అడ్డుకున్నారు. దీంతో షర్మిల వాగ్వాదానికి దిగడంతోపాటు.. బందోబస్తులో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్నారు. దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు షర్మిలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపర్చగా.. ఆమెకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించింది. దీంతో పోలీసులు షర్మిలను చంచల్ గూడ జైలుకు తరలింాచరు. అనంతరం షర్మిల తరుపు న్యాయవాదులు బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వాడీ వేడిగా వాదనలు జరిగాయి.
షర్మిలను అక్రమంగా అరెస్టు చేశారని.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని షర్మిల తరపున న్యాయవాది వాదించారు. మరోవైపు షర్మిల పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని.. ఆమెకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించారు. అనంతరం కోర్టు 30 వేల పూచికత్తుతో, ఇద్దరు షూరిటీతో షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలా ఉండగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తే జైల్లో పెడుతారా అంటూ వైఎస్ విజయలక్మీ సోమవారం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న షర్మిలను పరామర్శించిన విజయలక్ష్మి.. కార్యకర్తలంతా సంయమనంతో ఉండాలని కొరారు. నిరుద్యోగుల కోసం పోరాడుతున్న షర్మిలను అరెస్టు చేయడం సరికాదన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..