Bathukamma: తెలంగాణ బతుకమ్మ విశ్వవ్యాప్తం.. స్పెషల్‌ సాంగ్‌ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ కవిత

MLC Kalvakuntla Kavitha: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ పండగలా నిర్వహిస్తున్నారు.

Bathukamma: తెలంగాణ  బతుకమ్మ విశ్వవ్యాప్తం.. స్పెషల్‌ సాంగ్‌ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ కవిత
Mlc Kalvakuntla Kavitha
Follow us

|

Updated on: Sep 23, 2022 | 7:44 AM

MLC Kalvakuntla Kavitha: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ పండగలా నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని, లబ్దిదారులకు బతుకమ్మ కానుకలను అందజేస్తున్నారు. మేడ్చల్‌ జిల్లా కీసర మండలం చిర్యాల్‌లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు మంత్రి మల్లారెడ్డి. ఖమ్మంలోని నయా బజార్‌, శాంతినగర్‌, గట్టయ్య సెంటర్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌ బతుకమ్మ చీరలను అందజేశారు. బతుకమ్మకు పూజలు నిర్వహించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

ఇదిలా ఉంటే బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జెన్నారం జెడ్పీటీసీ ఎర్ర శేఖర్‌ బృందం రూపొందించిన ‘సిరిమల్లెలో రామ.. రఘుమల్లెలో’ అనే ప్రత్యేక గీతాన్ని హోంశాఖమంత్రి మహమూద్‌ అలీతో కలిసి గురువారం ఆమె ఆవిషరించారు. కవిత నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో హోంశాఖమంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ దీపికారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజీబ్‌, హజ్‌ కమిటీ చైర్మన్‌ సలీం తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles