Telangana: టిఫిన్ చేసి వచ్చేలోపు రూ.23 లక్షలు మాయం.. అదే అసలు డౌట్
ఇటీవలి కాలంలో దొంగలు శ్రమ పడకుండానే బుర్రకు పని చెప్పి దొంగతనాలు చేస్తున్నారు. క్షణాల్లో తమ టార్గెట్ పూర్తి చేసుకొని బయట పడుతున్నారు. బస్సు దిగి టిఫిన్ చేసి వచ్చేలోపే క్యాష్ బ్యాగ్ మాయమైంది. అయితే బాధితుడిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. డీటేల్స్ తెలుసుకుందాం పదండి....
ఏపీలోని బాపట్లకు చెందిన వెంకటేష్ అనే యువకుడు ఆదివారం చెన్నయ్ నుండి హైదరాబాద్‌కు చామ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వెళ్తున్నాడు. ఉదయం 9 గంటల సమయంలో నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి శివారులోని పూజిత హోటల్ వద్ద టిఫిన్ చేయడానికి బస్సు ఆగింది. అందరితో పాటు వెంకటేష్ కూడా తన వద్ద 23 లక్షల కరెన్సీతో ఉన్న బ్యాగును బస్సులో ఉంచి దిగాడు. హోటల్లోకి వెళ్లిన వెంకటేష్ టిఫిన్ చేసి వచ్చి బస్సులో చూడగా డబ్బులు ఉన్న బ్యాగు కనిపించలేదు. బస్సులో క్యాష్ బ్యాగ్ మాయం కావడంతో వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.23 లక్షలు ఉన్న క్యాష్ బ్యాగ్.. అది కూడా భుజాలకి ఈజీగా తగిలించుకునేలానే ఉన్న బ్యాగ్‌ను బస్సులో వదిలేసి.. నిర్లక్ష్యంగా టిఫిన్ చేయడానికి ఎలా వెళ్తాడని వెంకటేష్‌పై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అక్కడి సీసీ ఫుటేజీలో ఓ వ్యక్తి బ్యాగుతో పరారవుతున్నట్లు ఉంది. దీంతో పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..