ఇద్దరు మైనర్ల ప్రేమ కథ.. సినిమా కథను మించిపోయింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి చేసుకోవడానికి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేశారు.
అయితే ఈ ప్రేమ్ కహనీకి పోలీసులు క్లైమాక్స్ రాశారు. నిర్మల్ జిల్లా బాసరలో పెళ్లి చేసుకోవడానికి మైనర్ల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి సినిమాల ప్రభావం నేటి యువతరం మీద ఎక్కువ ఉంది. ప్రేమ అనే అంశం లేకుండా సినిమాలు ఉండటం లేదు. వీటిని చూసిన యువత ప్రేమ పేరుతో ఆకర్షితులవుతున్నారు. దీనికి తోడు సెల్ఫోన్లు ప్రేమికులను మరింత చేరువ చేస్తున్నాయి. చాటింగ్, వాట్సాప్ కాల్, వీడియో కాల్‌తో ప్రేమికులు నిత్యం కలుసుకునే వీలుగా ఉంటుంది. దీంతో పట్టుమని పద్దెనిమిదేళ్లు నిండక ముందే ప్రేమ పేరుతో కొందరు టీనేజర్లు ఊహల లోకంలో విహరిస్తున్నారు.
చదువు, ఉద్యోగం.. జీవితంలో నిలదొక్కుకోవడం వంటి విషయాలను పక్కన పెట్టి ప్రేమాయణం సాగిస్తున్నారు. దీంతో తెలిసీతెలియని వయసులో యువతీయువకులు ప్రేమించుకోవడం. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం సహజంగా జరుగుతుంటాయి. వీళ్లు కూడా ఆ వయసులో కలిగే ఆకర్షణను వారిద్దరూ ప్రేమగా భావించారు. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించరని భావించి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేశారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరి మతాలు వేరు వేరు కావడంతో స్థానికులకు వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. వారు ఇచ్చే సమాధానాలు కూడా తేడాగా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..