Telangana: తెలంగాణ రాజకీయాల్లో లేఖల పర్వం.. బడ్జెట్ ఆమోదం కోరుతూ మంత్రి హరీశ్ లేఖ..

ఈ ఏడాది బడ్జెట్‌ను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ తమిళిసై ఇంకా ఆమోదం తెలపకపోవడంపై తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ నెల 21 న గవర్నర్ కు బడ్జెట్..

Telangana: తెలంగాణ రాజకీయాల్లో లేఖల పర్వం.. బడ్జెట్ ఆమోదం కోరుతూ మంత్రి హరీశ్ లేఖ..
Minister Governor
Follow us

|

Updated on: Jan 30, 2023 | 2:42 PM

ఈ ఏడాది బడ్జెట్‌ను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ తమిళిసై ఇంకా ఆమోదం తెలపకపోవడంపై తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ నెల 21 న గవర్నర్ కు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అనుమతి కోరింది. ఈ నెల 26న ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు స్వయంగా గవర్నర్ ను కలిశారు. మంత్రి హరీశ్ రావు ఈ నెల 27న గవర్నర్ కు లేఖ రాశారు. ఫిబ్రవరి మూడో తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నందున.. వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని హరీశ్ రావు లేఖలో కోరారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి లేఖ రాశారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉందా అని లేఖలో ప్రశ్నించారు.

మరోవైపు.. గవర్నర్ అంశంపై అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్లు హుందాగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, అహంకార ధోరణితో ఉండొద్దని గాంధీ అన్న మాటలను వారు గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వాలు మారడం కాదు- ప్రజల బతుకులు మారాలన్నారు. దేశంలో మతోన్మాద శక్తులు, మరెన్నో రకరకాల సమస్యలు దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని ఫైర్ అయ్యారు.

కాగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య దూరం రోజురోజుకు పెరిగిపోతోంది. ఫిబ్రవరి మూడో తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. గతేడాది గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈసారి కూడా అలాగే చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం