Minister Harish Rao: రైతు బంధు నిధులు నిలిపివేతపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

|

Nov 27, 2023 | 12:42 PM

రైతు బంధు నిధులను ఎన్నికల కమిషన్ నిలిపివేయడంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. జహీరాబాద్‌ నియోజకవర్గం ఝరాసంగంలో ఆయన బీఆర్‌ఎస్‌ తరపున ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టాలని ఓటర్లకు హరీష్‌రావు పిలుపిచ్చారు. రైతు బంధుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది.. యాసంగి పంటకు మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి అని వాళ్లు చెప్పిన మాటలే చెప్పాను.

Minister Harish Rao: రైతు బంధు నిధులు నిలిపివేతపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Harish Rao Comments On brake on the release of Rythu Bandhu funds in Telangana
Follow us on

తెలంగాణలో రైతు బంధు నిధులను ఎన్నికల కమిషన్ నిలిపివేయడంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. జహీరాబాద్‌ నియోజకవర్గం ఝరాసంగంలో ఆయన బీఆర్‌ఎస్‌ తరపున ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టాలని ఓటర్లకు హరీష్‌రావు పిలుపిచ్చారు. రైతు బంధుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది.. యాసంగి పంటకు మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి అని వాళ్లు చెప్పిన మాటలే చెప్పాను. కొత్తగా ఏమీ చెప్పలేదు అని హరీష్ రావు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ ఎన్నికల క్యాంపెయిన్ చైర్మెన్‌గా ఉన్న నిరంజన్ ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేశారన్నారు. ఈ నిధులను ఆపివేయాని ఎన్నికల సంఘానికి కోరినట్లు తెలిపారు. నోటికాడ బుక్కను ఎత్తికొడతదా ఈ కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు.. ఇస్తున్న కేసీఆర్‌కు అడ్డుపడతరా అని ప్రశ్నించారు.

రైతు బంధు నిధులు పడకుండా ఎన్ని రోజులు ఆపగలరు.. డిశంబర్ 3వ తేదీ వరకూ ఆపగలరు. డిశంబర్ 3 తరువాత మళ్లీ ఉండేది మా కేసీఆర్ ప్రభుత్వమే అని కాంగ్రెస్ నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. డిశంబర్ 3వ తారీఖు తరువాత రైతు బంధు పైసలు టింగు.. టింగు మని రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు.  కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుబంధు ఆగిపోతుందని అన్నారు. తాము ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నామని, కాని కాంగ్రెస్‌ మాత్రం భూమితో సంబంధం లేకుండా రైతుకు రూ. 15 వేలు మాత్రమే ఇస్తానని చెప్తోందని హరీష్‌ రావు వివరించారు. రైతుబంధును అడ్డుకున్న కాంగ్రెస్‌కు రైతులు బుద్ధి చెప్తారని హరీష్‌రావు హెచ్చరించారు. రైతులతో మాది ఓటు బంధం కాదు పేగు బంధం అని చెప్పారు. 2017లో రైతు బంధు ఇచ్చినప్పుడు ఓట్లు లేవు.. ఓట్ల కోసం రైతు బంధు ఇవ్వట్లేదు అని వివరించారు. కర్ణాటకలో రైతు బంధును ఆపేసిన కాంగ్రెస్ పార్టీ.. అదే విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తుంది. ఈ పార్టీకి రైతులు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..