Fake Vaccine: ఇది కదా నిర్లక్ష్యమంటే.. చనిపోయిన వ్యక్తికి బూస్టర్ డోస్ వేసేసిన వైద్య శాఖ..!

|

Feb 19, 2022 | 8:20 AM

Fake Vaccine: వ్యాక్సీనేషన్ డ్రైవ్‌లో వైద్య శాఖ పనితీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడో చనిపోయిన వ్యక్తికి..

Fake Vaccine: ఇది కదా నిర్లక్ష్యమంటే.. చనిపోయిన వ్యక్తికి బూస్టర్ డోస్ వేసేసిన వైద్య శాఖ..!
Vaccine
Follow us on

Fake Vaccine: వ్యాక్సీనేషన్ డ్రైవ్‌లో వైద్య శాఖ పనితీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడో చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు బూస్టర్ డోస్ వేసినట్లు సృష్టించి అభాసులు పాలయ్యారు వైద్య శాఖ అధికారులు. వివరాల్లోకెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య శాఖ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలోని న్యూ గొల్లగూడెంకి చెందిన కొత్త మల్లా రెడ్డి అనే రిటైర్డ్ హెడ్‌మాస్టర్ ఈనెల 11వ తేదీన చనిపోయాడు. అయితే అంత్యక్రియలు నిర్వహించిన ఆరు రోజుల తర్వాత బూస్టర్ డోస్ వేసినట్లు మల్లయ్య సెల్ కు SMS వచ్చంది. దాంతో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేయగా.. అది చూసి కుటుంబ సభ్యులను ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాదు మల్లయ్య భార్యకు కూడా బూస్టర్ డోస్ వేయకుండానే మేసెజ్ రావడంతో జిల్లా వైద్యాశాఖ అధికారులు అభాసు పాలవుతున్నారు.

ఇది ఒక్క కొత్తగూడెం జిల్లాలోనే కాదు.. చాలా చోట్ల ఇలాంటి అవకతవకలు జరుగుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష వివరణ ఇచ్చారు. పొరపాటున జరిగిందని.. దీన్ని వెంటనే ఆన్‌లైన్ నుంచి తొలగించామని చెప్పారు ఆమె. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. అయితే చనిపోయిన వ్యక్తికి వాక్సినేషన్ వేసినట్లు రికార్డులు రూపొందించడం వల్ల వైద్యశాఖ ఉద్యోగులకు వచ్చే లాభమేంటి.? ఇది పొరపాటుగా జరిగిందా? లేక టార్గెట్ కోసం గతంలో వేసిన ఆధార్ నంబర్లను ఫీడ్ చేసుకున్నారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలు రియల్ గా ఎంతమందికి డోస్ తీసుకున్నారు.? వ్యాక్సిన్ వేయకుండా రికార్డులకు ఎక్కించినవి ఎన్ని? అన్నది అంతుచిక్కని ప్రశ్నే.

Also read:

Punjab Kings: పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీలో ట్విస్ట్.. ఆ ప్లేయర్‌ని ఎన్నుకుంటే జీరో నుంచి ప్రయాణించాల్సిందే..

APVVP Nellore Jobs: నిరుద్యోగులకు అలర్ట్‌..కడప జిల్లాలో 126 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..అకడమిక్‌ మెరిట్‌తో ఎంపికలు..

Health Tips: లేట్ నైట్‌లో ఫుడ్ తింటున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!