మళ్లీ వచ్చేశారు.. వణికిస్తున్న ముసుగు దొంగలు.. మారణాయుధాలతో కాలనీల్లో సంచారం!

తెలంగాణలోని కామారెడ్డి పట్టణంలో మరోసారి ముసుగు దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి వేళ పలు కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. రెండు ఇళ్లలో నగదును అపహరించినట్లు సమాచారం. ఈ ఘటనలతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

మళ్లీ వచ్చేశారు.. వణికిస్తున్న ముసుగు దొంగలు.. మారణాయుధాలతో కాలనీల్లో సంచారం!
Masked Thieves

Edited By:

Updated on: Nov 19, 2026 | 10:26 AM

తెలంగాణలోని కామారెడ్డి పట్టణంలో మరోసారి ముసుగు దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి వేళ పలు కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. రెండు ఇళ్లలో నగదును అపహరించినట్లు సమాచారం. ఈ ఘటనలతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రం శివారులోని దేవీవిహార్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో తాళం వేసి ఉన్న ఇంటిని దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు, ఇంట్లో దాచిన రూ.25 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ముసుగులు ధరించి, బ్యాగులు పట్టుకుని వచ్చిన దొంగలు చోరీ అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులకు సంబంధించిన ఫుటేజీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా, గత కొన్ని నెలల క్రితం కూడా ఇదే తరహాలో ముసుగులు ధరించిన దొంగల ముఠా కామారెడ్డి పట్టణంలో సంచరిస్తూ చోరీలకు పాల్పడినట్లు సమాచారం. అప్పట్లో నిందితులను గుర్తించలేకపోయారు. తాజాగా మళ్లీ అదే తరహా ముఠా కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దొంగలు చేతుల్లో మారణాయుధాలతో సంచరిస్తున్నారనే సమాచారంతో ప్రజల్లో భయం మరింత పెరిగింది.

ఈ ముఠా బీహార్‌కు చెందినదై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us