నెంబర్ ప్లేట్ మార్చి ‘స్మార్ట్’ అనుకున్నాడు.. సీసీ కెమెరాల ముందు బోల్తా పడ్డాడు..!

హైదరాబాద్‌లో నిబంధనలు పాటించినా ఓ మహిళకు ట్రాఫిక్ ఫైన్లు రావడం తీవ్ర కలకలం రేపింది. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక భారీ నకిలీ నంబర్ ప్లేట్ మోసం వెలుగులోకి వచ్చింది. శేరిలింగంపల్లి మదీనగూడకు చెందిన కార్తిక జయ (23) అనే ప్రైవేట్ ఉద్యోగి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నెంబర్ ప్లేట్ మార్చి స్మార్ట్ అనుకున్నాడు.. సీసీ కెమెరాల ముందు బోల్తా పడ్డాడు..!
Traffic Challan Cheating

Edited By:

Updated on: May 16, 2026 | 9:49 PM

హైదరాబాద్‌లో నిబంధనలు పాటించినా ఓ మహిళకు ట్రాఫిక్ ఫైన్లు రావడం తీవ్ర కలకలం రేపింది. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక భారీ నకిలీ నంబర్ ప్లేట్ మోసం వెలుగులోకి వచ్చింది. శేరిలింగంపల్లి మదీనగూడకు చెందిన కార్తిక జయ (23) అనే ప్రైవేట్ ఉద్యోగి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నిందితుడు తన కొత్త బైక్‌కు ఇంకా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో, ఉన్న తాత్కాలిక నంబర్ TG07K T/R 0826 కాదని, నిబంధనలకు విరుద్ధంగా TG07AE0286 అనే నంబర్ ప్లేట్‌ను అమర్చాడు. అయితే, ఆ నంబర్ అసలుకు ఒక మహిళకు చెందిన స్కూటీది. దీనివల్ల నిందితుడు బైక్‌పై చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనల ఈ-చలాన్లు అన్నీ అసలు స్కూటీ యజమానికి వెళ్లడం ప్రారంభించాయి. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా జరిమానాలు వస్తుండటంతో బాధితురాలు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించింది.

రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు బంజారాహిల్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిసి విచారణ చేపట్టారు. ఆధునిక ఏఎన్‌పీఆర్ (ANPR) టెక్నాలజీ, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ నంబర్ ప్లేట్లు వాడటం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద నంబర్ ప్లేట్లు కనిపిస్తే హైదరాబాద్ ట్రాఫిక్ ఈ-చలాన్ పోర్టల్, echallanhelpdesk.hyd@gmail.com లేదా 8712661690 వాట్సాప్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us