Hyderabad: కాలేజీల్లో సినిమా ఈవెంట్లా..? ఉన్నత విద్యా మండలి సీరియస్

సెలవు ప్రకటించి కళాశాలలో సినిమా ఈవెంట్ నిర్వహించడంపై మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీకి ఉన్నత విద్యామండలి నోటీసులు జారీ చేయనుంది. ఘటనపై ఎస్ఎఫ్ఐ నేతలు ఫిర్యాదు చేయడంతో వివరణ కోరాలని నిర్ణయించింది. మరోవైపు విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ముసాయిదా సిద్ధం చేసింది.

Hyderabad: కాలేజీల్లో సినిమా ఈవెంట్లా..? ఉన్నత విద్యా మండలి సీరియస్
Higher Education Council

Edited By:

Updated on: Oct 30, 2026 | 12:28 PM

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీకి సెలవు ప్రకటించి, అదే రోజు కళాశాలలో సినిమా ఈవెంట్ నిర్వహించడంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్‌తో పాటు పలువురు విద్యార్థి సంఘాల నేతలు గురువారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఛైర్మన్ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి.. తక్షణమే వర్సిటీకి నోటీసులు జారీ చేసి వివరణ కోరుతామని తెలిపారు.

మరోవైపు, విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఇటీవల ఎంవీఎస్ఆర్ కళాశాలలో దాండియా వేడుకల సందర్భంగా లైటింగ్ ఆర్చ్ కూలిన ఘటనలో  ఓ విద్యార్థిని మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు సంబంధించిన కొత్త బిల్లు ముసాయిదాను సిద్ధం చేసినట్లు ఛైర్మన్ వెల్లడించారు.

ఈ ముసాయిదా ప్రతిని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాతో పాటు సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి శ్రీధర్‌కు అందజేసినట్లు తెలిపారు. విద్యాసంస్థలు నిబంధనలు ఉల్లంఘించడం, విద్యార్థుల భద్రతకు ముప్పు కలిగించే ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు పేర్కొన్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us