
మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని..ఈ భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం కురిసేటప్పుడు చెట్లు నిల్చోవద్దని తెలిపారు.
నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
వాతావరణ శాఖ ప్రకారం.. ఈ రోజు మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే వర్షాల సమయంలో 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని అంచనా వేశారు.
తెలంగాణలో వర్షాలు ఇలా
ఇక అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని మెదక్, సిద్దిపేట, మేడ్చల్-మల్కాజిగిరి, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని రాబోయే గంటల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు.
రాబోయే మూడు గంటల్లో యాదాద్రి-భువనగిరి, జనగాం, హన్మకొండ, కరీంనగర్ , పెద్దపల్లి , మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలకు కూడా వర్షాలు విస్తరించే అవకాశం ఉందని తెలింది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్‌లో వర్షాలు ఇలా
ఇక హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్, మణికొండ, అత్తాపూర్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, నాంపల్లి, బేగంపేట్, జూబ్లీహిల్స్, గోల్కొండ, టోలిచౌకి, కాప్రా, అల్వాల్, ఈసీఐఎల్, సైనిక్‌పురి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఘట్‌కేసర్, కీసర, బోడుప్పల్‌లో ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయని.. ఇవి రాబోయే కొన్ని గంటల వరకు కొనసాగే ఛాన్స్ ఉందని తెలిపింది. అలాగే పటాన్‌చెరు, లింగంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్, గాజులరామారం వంటి ఉత్తర, పశ్చిమ హైదరాబాద్‌లో కూడా వర్షాలు కురుస్తాయని సూచించారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.