KCR: భారీ బందోబస్తుతో ఉండే కేసీఆర్.. రోడ్డు పక్కన గుడిసె హోటల్‌లో బజ్జీలు తింటూ కనిపించిన గులాబీ బాస్

లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలవటమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా బస్సు యాత్రను చేస్తున్న ఆయన.. ఖమ్మం వెళ్తుండగా మార్గమధ్యలో ఎల్లంపేట స్టేజ్ తండా దగ్గర తన కాన్వాయ్ ఆపించారు. రోడ్డుపక్కన ఉన్న ఓ చిన్న హోటల్‌లో కాసేపు సేదతీరారు. హోటల్‌లో బజ్జీలు, పకోడి తింటూ టీ తాగుతూ ఆస్వాదించారు.

Kcr At Hotel
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 30, 2024 | 10:40 AM

లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలవటమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా బస్సు యాత్రను చేస్తున్న ఆయన.. ఖమ్మం వెళ్తుండగా మార్గమధ్యలో ఎల్లంపేట స్టేజ్ తండా దగ్గర తన కాన్వాయ్ ఆపించారు. రోడ్డుపక్కన ఉన్న ఓ చిన్న హోటల్‌లో కాసేపు సేదతీరారు. హోటల్‌లో బజ్జీలు, పకోడి తింటూ టీ తాగుతూ ఆస్వాదించారు.

ఎన్నికల ప్రచార బస్సుయాత్రలో భాగంగా వరంగల్ నుండి ఖమ్మం బయలుదేరిన కేసీఆర్, మార్గమధ్యలో కాసేపు టీ బ్రేక్ తీసుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న ఓ గుడిసె హోటల్ వద్ద ఆగారు. ఆ గుడిసె హోటల్‌లో బజ్జీలు, పకోడి తిని, టీ తాగారు. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలను చూసిన జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు.

వీడియో చూడండి…

ఖమ్మం – వరంగల్ మార్గమధ్యలో కేసీఆర్ మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా వద్ద ఆగారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న హోటల్లోకి వెళ్లి అక్కడ టీ తాగారు. గరం గరం బజ్జీలు తింటూ కాసేపు కార్యకర్తలు, పార్టీ ముఖ్య నేతలతో ముచ్చట్లు పెట్టారు. కేసిఆర్ తో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దేశపతి శ్రీనివాస్, సంతోష్ కుమార్ అన్నారు

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం బస్సు యాత్ర చేపట్టిన గులాబీ బాస్, లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఆదివారం హనుమకొండలో బస్సుయాత్ర రోడ్ షో లో పాల్గొన్నారు.. రాత్రి హనుమకొండ లోని కెప్టెన్ లక్ష్మీ కాంతరావ్ నివాసంలో బస చేశారు. సోమవారం ఖమ్మం లో బస్సు యాత్ర, రోడ్ షో సందర్భంగా వర్దన్నపేట, తొర్రూరు, మరిపెడ మీదుగా ఖమ్మం చేరుకున్నారు. బస్సుయాత్ర వెళ్తున్న మార్గమధ్యలో ఎక్కడ చూసినా పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ఈక్రమంలోనే బస్సు దిగి ఆ హోటల్ లోకి వచ్చిన కేసీఆర్ హోటల్లోని గరం గరం మిర్చిలు తిని ముచ్చట పడ్డారు.. అక్కడ టీ తాగి గ్రామాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై స్థానిక ప్రజలతో ముచ్చటించి వివరాలు సేకరించారు.

కేసీఆర్ ఆగినట్టు తెలుసుకున్న స్థానికులు ఆయనను చూసేందుకు రాగా.. వారితో కాసేపు మాట్లాడారు. అంతేకాకుండా అక్కడి వారికి మిర్చీలను కూడా ఇచ్చి ఆప్యాయంగా మాట్లాడారు. దీంతో హోటల్ పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. ఎప్పుడు భారీ బందోబస్తుతో ఉండే కేసీఆర్.. ఇలా రోడ్డు పక్కన చిన్న హోటల్‌లో బజ్జీలు తినుకుంటూ కనిపించడంతో.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
డే టైమ్‌లో కూడా బైక్‌ లైట్స్‌ ఆన్‌ లోనే ఎందుకు.? కారణం ఏంటంటే..

అయ్యో అక్కయ్యా.. ఎంతకష్టం వచ్చింది నీకు.! వీడియో వైరల్..

ఒక్కరోజులో యాదాద్రి టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..

కోల్‌కతా, హైదరాబాద్‌ పోరులో గెలిచేది ఎవరు? ఎస్‌ఆర్‌హెచ్‌కు నిరాశే

డబ్బుకోసం అతన్ని పెళ్లి చేసుకుందని కామెంట్స్

ఇద్దరి గుట్టు వీడింది.. మరీ మూడో వ్యక్తి ఎవరు..?

మహిళల్లో సంతాన లేమికి కారణం అవుతున్న మొబైల్ అడిక్షన్.. జర భద్రం!

ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.

భారత టీ20 ప్రపంచకప్‌ జట్టులో SRH తుఫాన్ బ్యాటర్ ఎంట్రీ..

అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
అయ్యో అక్కయ్యా.. ఎంతకష్టం వచ్చింది నీకు.! వీడియో వైరల్..
అయ్యో అక్కయ్యా.. ఎంతకష్టం వచ్చింది నీకు.! వీడియో వైరల్..
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
పెరుగుతో కాన్సర్‌కు చెక్‌.. 14 లక్షలమందిపై పరిశోధనలు.

పురుషుల సంతానలేమికి తల్లే కారణమా.? CCMB అధ్యయనం..

భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! దేశీస్‌ డిసైడ్‌ సదస్సులో వ్యాఖ్యలు..

టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!

ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ

ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ?

‘గున్న ఏనుగుకు జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ’.