రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు
మేడ్చల్ : కొడంగల్లో చెల్లని రూపాయి మేడ్చల్లో చెల్లుతుందా? అంటూ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు విసిరారు. మేడ్చల్లో నిర్వహించిన టీఆర్ఎస్ రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని మీరు అంగీకరిస్తారా అంటూ ప్రశ్నించారు. సొంత జిల్లాలో, సొంత ఊరులోనే ఓడిపోయిన రేవంత్, ఇక్కడికొచ్చి ‘నేను అది చేస్తా, ఇది చేస్తా అంటే నమ్ముదామా? అంటూ ప్రజల్ని ప్రశ్నించారు. […]
మేడ్చల్ : కొడంగల్లో చెల్లని రూపాయి మేడ్చల్లో చెల్లుతుందా? అంటూ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు విసిరారు. మేడ్చల్లో నిర్వహించిన టీఆర్ఎస్ రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని మీరు అంగీకరిస్తారా అంటూ ప్రశ్నించారు. సొంత జిల్లాలో, సొంత ఊరులోనే ఓడిపోయిన రేవంత్, ఇక్కడికొచ్చి ‘నేను అది చేస్తా, ఇది చేస్తా అంటే నమ్ముదామా? అంటూ ప్రజల్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఓ మంచి వ్యక్తిని ఇక్కడి నుంచి పోటీలోకి దింపితే గౌరవించేవాళ్లం కానీ, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని నిలబెట్టారని అన్నారు.