Telangana: ఖమ్మం అబ్బాయి, బ్రిటన్‌ అమ్మాయి ఒక్కటైన వేళ..

విదేశాల్లో పరిచయం.. ప్రేమగా మారి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు ఖమ్మానికి చెందిన భరత్‌, బ్రిటన్‌ యువతి ఎలిజబెత్‌. ఇంగ్లాండ్‌లో ఒకే శాఖలో ఉద్యోగం చేస్తున్న వీరిద్దరూ కుటుంబాల అంగీకారంతో ఖమ్మంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. రెండు దేశాలు, రెండు సంస్కృతులు ప్రేమతో ఒక్కటైన ఈ పెళ్లి నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Telangana: ఖమ్మం అబ్బాయి, బ్రిటన్‌ అమ్మాయి ఒక్కటైన వేళ..
Indian British Couple

Updated on: Nov 23, 2026 | 12:11 PM

విదేశాల్లో మొదలైన పరిచయం.. ప్రేమగా మారి, రెండు దేశాలు, రెండు సంస్కృతులను ఒక్కటిగా చేసింది. ఖమ్మానికి చెందిన భరత్‌, బ్రిటన్‌కు చెందిన ఎలిజబెత్‌ ఆదివారం భారతీయ సంప్రదాయంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన భరత్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన అనంతరం ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లారు. 2021లో ఎంఎస్‌ పూర్తి చేసి, అక్కడే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించి పెన్షన్‌ శాఖలో కొలువు సాధించారు. అదే శాఖలో పనిచేస్తున్న బ్రిటన్‌కు చెందిన ఎలిజబెత్‌తో పరిచయం ఏర్పడింది. కలిసి పనిచేస్తున్న క్రమంలో మొదలైన స్నేహం ప్రేమగా మారింది.

ఇద్దరూ తమ మనసులోని మాటను కుటుంబ సభ్యులకు చెప్పగా, ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పెళ్లికి మార్గం సుగమమైంది. దీంతో ఖమ్మం బోనకల్లు రోడ్డులోని ఓ వేడుకల మందిరంలో ఆదివారం హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది. రెండు దేశాలకు చెందిన కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో భరత్‌, ఎలిజబెత్‌ కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

 

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us