Viral Video: తుప్పల్లో ఏదో తెలియని అలజడి.. ఏంటా అని దగ్గరికి వెళితే.. వామ్మో

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని శ్రీరామ కాలనీలో రెండు పాములు ఒకదానితో ఒకటి పెనవేసుకుని విన్యాసాలు చేసిన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. గృహ సముదాయాల మధ్య దాదాపు 20 నిమిషాల పాటు కనిపించిన ఈ దృశ్యాన్ని స్థానికులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొందరు ఆసక్తిగా వీక్షించగా, మరికొందరు భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు.

Viral Video: తుప్పల్లో ఏదో  తెలియని అలజడి.. ఏంటా అని దగ్గరికి వెళితే.. వామ్మో
Viral

Edited By:

Updated on: Jun 03, 2026 | 5:06 PM

సాధారణంగా పాము కనిపిస్తే.. ఓర్నాయనో అంటూ భయంతో పరుగులు తీస్తారు. అదే దగ్గరగా.. ఒకేసారి రెండు పాములు ఒకదానితో ఒకటి పెనవేసుకొని సయ్యాటలాడుతున్న దృశ్యాన్ని చూసి జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తుప్పల్లో నుంచి బుసలు కొడుతున్న శబ్దాలు వస్తుండటంతో అక్కడకు వెళ్లి చూశారు.. రెండు పాములు పెనవేసుకుని కనిపించడంతో.. ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని శ్రీరామ కాలనీలో చోటుచేసుకుంది. కాలనీలోని గృహ సముదాయాల మధ్య రెండు పాములు ఒకదానితో ఒకటి అల్లుకొని దాదాపు అరగంట పాటు విన్యాసాలు చేస్తూ కనిపించాయి. పాములు ఎత్తుగా లేచి ఒకదానిపై మరొకటి చుట్టుకుంటూ కదలడం చూసి.. ప్రజలు ఆశ్చర్యపోయారు.. దాదాపు 20 నిమిషాల వరకు పాములు అక్కడే ఉన్నాయి.. సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆ దృశ్యాన్ని తిలకించారు.

వీడియో చూడండి..

చాలామంది తమ సెల్‌ఫోన్లలో ఈ ఘటనను వీడియోలుగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. పాముల సయ్యాటను చూసి కొందరు ఆసక్తిగా గమనిస్తే, మరికొందరు భయాందోళనలకు గురై ఇళ్లలోనే ఉండిపోయారు. అయితే.. ఇలాంటి సందర్భంలో పాములను రెచ్చగొట్టకుండా, వాటికి దూరంగా ఉండాలని స్నేక్ క్యాచర్ లు, జంతు ప్రేమికులు సూచిస్తున్నారు.

కొంతసేపటి అనంతరం ఆ రెండు పాములు అక్కడి నుంచి సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us