JNTU Exams: జులైలో బీటెక్‌, బీఫార్మసీ పరీక్షలు.. షెడ్యూల్‌ విడుదల చేసిన హైదరాబాద్ జేఎన్‌టీయూ..

|

Jun 25, 2021 | 7:53 AM

JNTU Exams: బీటెక్, బీఫార్మసీ థర్డ్, ఫైనల్ ఇయర్ పరీక్షలు జులై నెలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జేఎన్‌టీయూ..

JNTU Exams: జులైలో బీటెక్‌, బీఫార్మసీ పరీక్షలు.. షెడ్యూల్‌ విడుదల చేసిన హైదరాబాద్ జేఎన్‌టీయూ..
Jntu
Follow us on

JNTU Exams: బీటెక్, బీఫార్మసీ థర్డ్, ఫైనల్ ఇయర్ పరీక్షలు జులై నెలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జేఎన్‌టీయూ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. థర్డ్, ఫైనల్ ఇయర్ మొదటి సెమిస్టర్ పరీక్షలను జులై 1 నుంచి 3 వ తేదీల్లో నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ పరీక్షలు మార్చి 25 నుంచి 27 మధ్య జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తూ జేఎన్టీయూ నిర్ణయించింది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో పరీక్షలను మళ్లీ నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది.

ఇక బీటెక్, బీఫార్మసీ ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను జులై 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించి పూర్తి వివరాలు కోసం అధికారిక వెబ్‌సైట్‌‌లో పొందుపరచడం జరిగిందని, విద్యార్థులు పరీక్షల షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చునని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే.. జేఎన్టీయూ అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్‌గా డి. శ్రీనివాసరావు నియామకం అయ్యారు.

Also read:

COVID-19 Testing: ఫోన్‌ స్వాబ్‌తో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు.. లండన్‌ శాస్త్రవేత్తల కొత్త విధానం

Suresh Productions: సంగీత ప్రపంచంలోకి ‘సురేష్ ప్రొడక్షన్స్’.. ఎస్పీ మ్యూజిక్ లేబుల్ పేరుతో.. లోగో ఆవిష్కరణ..

Gold : పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డ దాదాపు రూ. ఐదున్నర కోట్లు విలువైన బంగారం