
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. అధికారంలోకి రాగానే ఈ స్కీమ్ వెంటనే ప్రారంభించింది. తొలి విడతలో గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులకు 3 లక్షల వరకు కొత్త ఇళ్లను మంజూరు చేసింది. వీటిల్లో చాలా ఇళ్లు ఇప్పటికే పూర్తై గృహప్రవేశం కూడా పూర్తి చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం అర్బన్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది. హైదరాబాద్‌లోని క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మించి వీటిల్లో ఫ్లాట్‌ను లబ్దిదారులకు కేటాయించనుంది. ఇందుకోసం తొలి విడతలో దరఖాస్తు చేసుకున్నవారిలో ప్రాధాన్యత ప్రకారం కొంతమందికి ఫ్లాట్లు మంజూరు చేశారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణం ప్రారంభం కానుంది.
అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రూపొందింది ఇంటి నిర్మాణంలో ఈ నిబంధనలు పాటించకపోతే ఆర్ధిక సాయం నిలిచిపోయే అవకాశముంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు కొన్ని కఠిన నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లకు సంబంధించి ఇంటి స్లాట్ విస్తీర్ణం గరిష్టంగా 750 చదరపు అడుగులకు మించకూడదు. ఇంటి ప్లింత్ బీమ్ విస్తీర్ణంతో పోలిస్తే స్లాబ్ విస్తీర్ణం 25 శాతం మించి ఉండకూడదు. ఇక స్లాబ్ ఏరియా గరిష్టంగా 750 ఫీట్లు మించి నిర్మాణం చేపట్టకూడదు. ఈ నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేపడితే ప్రభుత్వ అందించే ఆర్ధిక సాయం నిలిచిపోయే అవకాశముంది. దీంతో స్లాబ్ నిర్మాణం చేసే సమయంలో విస్తీర్ణాన్ని లెక్కించుకోవాలి. ఇందిరమ్మ పథకం నిబంధనలు అనుగుణంగా స్లాబ్ నిర్మాణం చేపట్టాలి. అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలి. మీకు ఏమైనా సందేహాలుంటే గ్రామ, పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో అందుబాటులో ఉండే అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచిస్తోంది.
తొలి విడతలో ఇందిరమ్మ ఇళ్లను కొంతమందికి మంజూరు చేయగా.. వారిలో కొంతమంది తొలి విడత రూ.లక్ష డిపాజిట్ చేయలేదు. డబ్బులు చెల్లించలేక వెనక్కి తగ్గారు. దీంతో వారి స్థానంలో కొత్తవారికి ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ కేటాయించేందుకు లక్కీ డ్రా నవంబర్ 3, 4వ తేదీన తీయనున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఫ్లాట్లు ఎక్కువగా మిగిలినట్లు తెలుస్తోంది. వీటి కోసం రేపు మాప్ అప్ లాటరీ నిర్వహించనున్నారు. కొంతమంది ఆర్ధిక సమస్యల వల్ల ప్రభుత్వం నిర్దేశించి అమౌంట్‌ను డిపాజిట్ చేయలేకపోతున్నారు. దీంతో వారి స్థానంలో మిగతా అర్హులను గుర్తించి ఎంపిక కోసం లాటరీ పద్దతి అవలంభిస్తున్నారు. లాటరీలో ఎవరి పేరు అయితే వస్తుందో వారికి మంజూరు పత్రాలు అందిస్తారు.