Weather Report: బంగాళాఖాతంలో మారిన వాతావరణం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇప్పటికే గత రాత్రి హైదరాబాద్‌ సహా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాబట్టి ఈ రోజు ఏయే జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందో చూద్దాం.

Weather Report: బంగాళాఖాతంలో మారిన వాతావరణం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Heavy Rain Alert For Ap And Telangana

Updated on: Nov 27, 2026 | 10:42 AM

ఏపీ, తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలోని ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండడం, కొమొరిన్ ప్రాంతం నుంచి రాయలసీమ మీదుగా మరో ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఈ రోజు హైదరాబాద్‌తో పాటు మరో నాలుగు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 40 కి.మీ.లోపు వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. అలాగే రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని సూచించింది. ఇప్పటికే గత రాత్రి హైదరాబాద్‌ సహా సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో చాలా ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఏపీలో వాతావరణం ఇలా

ఇక ఈ ద్రోణి ప్రభావంతో అటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈ వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, పొలంలో ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కోరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us