నెట్టింట్లో వైరల్‌గా మారిన ఎంపీ సంతోష్‌కుమార్ ట్విట్
ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో గ్రీన్ ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది. గ్రీన్ ఛాలెంజ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తాను అచరిస్తూ.. ఇతరులను అనుసరించేలా చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో తాజాగా మరో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఎంపీ సంతోష్‌కుమార్ పెట్టిన ఫోటో, ట్విట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఆ ట్విట్ సారాంశం పరిశీలించినట్లైతే, ఢిల్లీలో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ఆయన ట్విట్ చేశారు. ‘ ఒకప్పుడు నీళ్లు అమ్మినప్పుడు నవ్వుకున్నాం. ఇప్పుడేమో గాలిని కూడా […]
ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో గ్రీన్ ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది. గ్రీన్ ఛాలెంజ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తాను అచరిస్తూ.. ఇతరులను అనుసరించేలా చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో తాజాగా మరో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఎంపీ సంతోష్‌కుమార్ పెట్టిన ఫోటో, ట్విట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఆ ట్విట్ సారాంశం పరిశీలించినట్లైతే, ఢిల్లీలో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ఆయన ట్విట్ చేశారు. ‘ ఒకప్పుడు నీళ్లు అమ్మినప్పుడు నవ్వుకున్నాం. ఇప్పుడేమో గాలిని కూడా అమ్ముతున్నారు. ఇది కఠినమైన వాస్తవం. ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఢిల్లీలో ఆక్సిజన్ బార్లు తెరుచుకున్నాయి. ఢిల్లీ ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం 15 నిమిషాలకు రూ. 299 చెల్లిస్తున్నారు. ఇప్పుడు మొక్కలు నాటడంపై మేల్కొనకపోతే భవిష్యత్‌లో ఆక్సిజన్ కొనాల్సిన దుస్థితి తప్పదన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఫ్రీగా ఆక్సిజన్ పొందండి’ అంటూ సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపుకు నెటిజన్ల నుండి మంచి స్పందన వచ్చింది. సోషల్ మీడియా
When the #water being sold
we thought it was #Fun,
Then comes da hard realty of#Air being sold today.
Don’t take it for granted.
“#OxygenBar opened in #Delhi,
Rs.299 for 15 mins of Inhailing
90% pure Oxygen”