KTR: రైతుల ఉసురు తీసిన బీజేపీ ఓ వైపు.. వారి తరఫున నిలిచిన కేసీఆర్ మరోవైపు.. కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్

కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ (Telangana) మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం, వారి ఆకాంక్షలు ఎన్నడూ తెలుసుకోలేరని చెప్పారు. ఆ విషయం మునుగోడులో అమిత్ షా సభ ద్వారా వెల్లడైందన్నారు. నల్ల..

KTR: రైతుల ఉసురు తీసిన బీజేపీ ఓ వైపు.. వారి తరఫున నిలిచిన కేసీఆర్ మరోవైపు.. కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్
Follow us

|

Updated on: Aug 23, 2022 | 7:08 AM

కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ (Telangana) మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం, వారి ఆకాంక్షలు ఎన్నడూ తెలుసుకోలేరని చెప్పారు. ఆ విషయం మునుగోడులో అమిత్ షా సభ ద్వారా వెల్లడైందన్నారు. నల్ల చట్టాలతో అన్నదాతల ఉసురు తీద్దామనుకున్న బీజేపీ ఓ వైపు.. రైతుల తరఫున నిలిచిన కేసీఆర్ మరోవైపు అని అన్నారు. కేసీఆర్​ను విమర్శించడాన్ని చూసి హిపోక్రసీ కూడా ఆత్మహత్య చేసుకుంటుందని మండిపడ్డారు. నూతన విద్యుత్ చట్టంతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు బీజేపీ (BJP) కుట్ర చేసిందని ఆరోపించారు. ఫసల్‌ బీమా యోజన పథకంలో తెలంగాణ చేరకపోవడాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) ఆ పథకం నుంచి గుజరాత్ ఎందుకు బయటకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు పథకానికి పేరు మార్చి పీఎం కిసాన్‌గా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడు వ్యవసాయ చట్టాలతో రైతులను వేధించి, వారి ప్రాణాలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా.. ఇప్పుడు తెలంగాణ రైతులపై కపట ప్రేమను కనబరుస్తున్నారని విమర్శించారు. లఖీంపుర్‌లో రైతుల మరణాలకు కారణమైన వారికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

మునుగోడుకు ఆర్థిక ప్యాకేజీ ఇస్తారని భావించారు. గోల్‌మాల్‌ గుజరాత్‌కు తప్ప గోల్డ్ మోడల్ తెలంగాణకు రూపాయీ ఇవ్వరు. ఆత్మాభిమానంలేని కొందరు అమిత్ షా చెప్పులు మోస్తున్నారు. తెలంగాణను తమ అధీనంలో పెట్టుకోవాలన్న కుట్రలకు తెలంగాణ ఎప్పుడూ లొంగదు. బియ్యం కొనుగోలు, కృష్ణా జలాల్లో వాటాలు తేల్చకుండా రాజకీయం చేస్తున్నారు. దేశంలోని ప్రతీ రంగాన్ని భష్టుపట్టిస్తున్నారు. రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. అమిత్ షా ప్రసంగం నిరుత్సాహానికి గురి చేసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ ఏ నాటికీ అర్థం చేసుకోలేదని మరోసారి తెలిసింది.

– కేటీఆర్, తెలంగాణ మంత్రి

ఇవి కూడా చదవండి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారన్నారని మండిపడ్డారు. ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని, రైతుల రుణమాఫీ చేస్తానని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణను కేసీఆర్‌ మరో బెంగాల్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫైవ్‌ స్టార్‌ ఫామ్‌ హౌజ్‌లో కూర్చొని కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్న అమిత్ షా.. కేసీఆర్‌ తెలంగాణను అప్పుల్లో ముంచేశారన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు