ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కీలకాంశాలు ఇవే

తెలంగాణలో ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 20 రోజుల పాటు ఈ సమావేశాలను జరపాలని ప్రభుత్వం భావిస్తోంది

ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కీలకాంశాలు ఇవే
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2020 | 8:30 AM

Telangana Assembly Session: తెలంగాణలో ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 20 రోజుల పాటు ఈ సమావేశాలను జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం 2 వారాల ముందు నుంచి పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే సీఎం కేసీఆర్, స్పీకర్, మండలి ఛైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు చేశారు. వారితో పాటు మర్సల్స్‌, మీడియా సభ్యులు, పోలీసులు, మంత్రుల పీఏలు, పీఎస్‌లు అందరికీ టెస్ట్‌లు జరిగాయి. కరోనా నెగిటివ్ రిపోర్ట్ చూపించిన వారినే అసెంబ్లీ ప్రాంగణలంలోకి అనుమతించనున్నారు.

మరోవైపు ఈ సమావేశాలకు పోలీసు ఉన్నతాధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తోన్న పోలీసులు.. ఆరు వందల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాలతో పాటు శాసన మండలి పరిసర ప్రాంతాల్లో మూడంచెలుగా పోలీసులు విధుల్లో పాల్గొననున్నారు.

ఇక అసెంబ్లీ, మండలిలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీలో 40, మండలిలో 8 సీట్లు అదనంగా వేశారు. సభ్యులకు ఆక్సీమీటర్‌, శానిటరీ బాటిల్‌, మాస్క్‌లతో కూడిన కిట్లను ఇచ్చారు. అసెంబ్లీ దగ్గర రెండు డయాగ్నస్టిక్ కేంద్రాలు, అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. గేలరీలలోకి సందర్శకుల అనుమతి ఉండదు. మీడియా పాయింట్‌ని తీశారు. ఇక సమావేశాలు ఎలా జరపాలన్న విషయంలో ఇవాళ జరిగే బీఏసీ మీటింగ్‌లో నిర్ణయించనున్నారు.

కాగా ఈ సభల్లో రెవెన్యూ చట్టం, మరో నాలుగు బిల్లులపై చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానం చేయనున్నారు. వీటితో పాటు కరోనా వ్యాప్తి, రాయలసీమ ఎత్తిపోతల పథకం, నియంత్రిత పద్దతిలో సాగు, రిజిస్ట్రేషన్లు వంటి అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షం కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Read More:

హైదరాబాద్‌లో మొదలైన మెట్రో సర్వీసులు.. వారికి ‘నో’ ఎంట్రీ

సెంట్రల్‌ జైలుకి నూతన్‌ నాయుడు