Ganesh Nimajjanam: నిఘా నీడలో ట్యాంక్‌బండ్‌.. చుట్టూ 100 హైరైజ్‌ కెమెరాలు

Ganesh Nimajjanam: హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనోత్సవానికి జలమండలి సర్వం సిద్ధం చేసింది. శోభాయాత్రకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 40 లక్షల వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేశారు. శోభాయాత్ర సందర్భంగా DJలు, సౌండ్ మిక్సర్లు..

Ganesh Nimajjanam: నిఘా నీడలో ట్యాంక్‌బండ్‌.. చుట్టూ 100 హైరైజ్‌ కెమెరాలు
Tank Bund

Updated on: Sep 25, 2026 | 7:30 AM

Ganesh Nimajjanam: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనల జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా నగరవ్యాప్తంగా 20 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన 10 వేల సీసీ కెమెరాల ద్వారా అనుక్షణం పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. శోభాయాత్ర మార్గాలపై 24 డ్రోన్లతో ప్రత్యేక నిఘా కొనసాగుతుంది. విగ్రహాల లెక్కింపునకు 100 హైరైజ్ కెమెరాలను వినియోగించనున్నారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శోభాయాత్రను పర్యవేక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరంలోని 4 ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రధాన ప్రాంతాల్లో IG, DIG స్థాయి అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. మహిళల భద్రత కోసం 26 షీ-టీమ్స్‌ను ఏర్పాటు చేసి మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.

– గణేష్ నిమజ్జనం కోసం 8,142 మంది అదనపు పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. 42 ప్లాటూన్లతో పాటు నాలుగు RAF, రెండు CRPF కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. నిమజ్జనం జరిగే జలాశయాల దగ్గర గజ ఈతగాళ్లు, రెస్క్యూ బోట్లు సిద్ధంగా ఉంచారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచారు. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రధాన కూడళ్ల దగ్గర అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు.

– శోభాయాత్ర సందర్భంగా DJలు, సౌండ్ మిక్సర్లు, అధిక శబ్దం చేసే డివైజ్‌ల వినియోగంపై నిషేధం అమల్లో ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పరికరాలను సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనోత్సవానికి జలమండలి సర్వం సిద్ధం చేసింది. శోభాయాత్రకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 40 లక్షల వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేశారు.

ఇది కూడా చదవండి: SBI కస్టమర్లకు షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త విత్‌డ్రా రూల్స్!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us