మై హోమ్ త్రిదశలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు.. ఆదివారం కల్యాణ మహోత్సవం..

హైదరాబాద్ తెల్లాపూర్‌ మై హోం త్రిదశలోని శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత.. శ్రీ మోహన కృష్ణుడి ఆలయ రెండో వార్షికోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ నెల 19 వరకు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శనివారం యాగశాలలో ద్వార తోరణం, ధ్వజ కుంభ ఆరాధన, మహా కుంభ స్థాపన అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగాయి.

మై హోమ్ త్రిదశలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు.. ఆదివారం కల్యాణ మహోత్సవం..
My Home Tridasa Brahmotsava

Updated on: May 17, 2025 | 11:31 PM

హైదరాబాద్ తెల్లాపూర్‌ మై హోం త్రిదశలోని శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత.. శ్రీ మోహన కృష్ణుడి ఆలయ రెండో వార్షికోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ నెల 19 వరకు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత.. శ్రీ మోహనకృష్ణ స్వామి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవానికి శుక్రవారం అంకురార్పణ జరగగా.. రెండోరోజు శనివారం యాగశాలలో ద్వార తోరణం, ధ్వజ కుంభ ఆరాధన, మహా కుంభ స్థాపన అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 5 గంటలకు యాగశాలలో నిత్య ఆరాధన.. రాత్రి 8 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చాలా మంది భక్తులు హాజరయ్యారు.

వీడియో చూడండి..


ఆదివారం కల్యాణ మహోత్సవం..

కాగా.. ఆదివారం ఉదయం శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ మోహనకృష్ణ స్వామి కల్యాణ మహోత్సవం జరగనుంది.. అనంతరం ఆదివారం సాయంత్రం గరుడ వాహన సేవ నిర్వహిస్తారు.

సోమవారం మహాపూర్ణాహుతి, అష్టోత్తరశత 108 కలాశాభిషేము, చక్రస్నానము తదితర పూజలను నిర్వహించనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us