
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఆఫీస్ కు వెళ్తుంటాడు.. వస్తుంటాడు.. అందరితో మంచిగానే ఉంటాడు.. పైకి.. ఎంత బుద్ధిమంతుడో అనుకునే లుక్.. ఇంకేముంది .. ఇలాంటి వారిపై ఎవరికైనా అనుమానం కలుగుతుందా..? అస్సలు కలగదు.. కానీ.. గురుడు మాత్రం.. టెర్రస్ పై అందరూ నోరెళ్లబెట్టే పనిచేశాడు.. ఏకంగా.. గంజాయ్ మొక్కలు పెంచుతూ.. సరదాగా గంజాయ్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు.. అయితే.. చాలా రోజుల తర్వాత బయటపడిన ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది. ఈ ఘటన హైదరాబాద్ నాచారంలో వెలుగు చూసింది.. ఇంటి డాబాపై గంజాయి మొక్కలను సాగు చేస్తున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఏప్రిల్ 20, సోమవారం నాడు నిషేధ, ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు. పోలీసులు సుమారు 10 కిలోగ్రాముల గంజాయిని.. ఉత్పత్తి చేయగల 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నాచారంలోని తూర్పు గాంధీనగర్ నివాసి అయిన సి.హెచ్. శశిధర్‌గా గుర్తించారు.
ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ ప్రకారం.. శశిధర్ గంజాయికి బానిసయ్యాడు.. తన జీతం మొత్తాన్ని ఆ మత్తుపదార్థం కోసం ఖర్చు చేసేవాడు.. అలా గంజాయ్ మత్తుకు అలవాటుపడి.. చివరికి తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని సైతం వదిలేశాడు.. గంజాయి కొనడానికి డబ్బులు లేకపోవడంతో, తన సొంత ఇంటి డాబాపై ఆ మొక్కలను పెంచడం ప్రారంభించాడు.
స్వాధీనం చేసుకున్న మొక్కలలో కొన్ని అప్పటికే పూయడం ప్రారంభించగా, మరికొన్ని మూడు మీటర్ల ఎత్తుకు పెరిగాయి. శశిధర్‌ను అరెస్టు చేసి ఘట్‌కేసర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, సీఐ బాలరాజు నేతృత్వంలోని అదే బృందం మేడపాటి నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను అరెస్టు చేసిందది. ఇద్దరు వ్యక్తుల నుంచి 480 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో బండి అరుణ్ కుమార్, బి ఆశిష్‌లను అరెస్టు చేసి ఘట్‌కేసర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..