Hyderabad : మాదాపూర్‌లో రోడ్డుపై గుట్టలు గుట్టలుగా 2 వేల నోట్లు.. ఎగబడ్డ వాహనదారులు.. కట్ చేస్తే

మాదాపూర్ ఒక్కసారిగా రూ.2 వేల నోట్లు గాలికి చెల్లాచెదురుగా ఎగురుతూ వచ్చాయి. వాటిని దక్కించుకునేందుకు స్థానికులు, వాహనదారులు పోటీపడ్డారు. కట్ చేస్తే...

Hyderabad : మాదాపూర్‌లో రోడ్డుపై గుట్టలు గుట్టలుగా 2 వేల నోట్లు.. ఎగబడ్డ వాహనదారులు.. కట్ చేస్తే
Children's Bank Currency Notes

Updated on: Jan 13, 2022 | 1:46 PM

హైదరాబాద్ మాదాపూర్‌లో నకీలీ రెండు వేల నోట్లు కలకలం సృష్టించాయి. బుధవారం ఉదయం కాకతీయహిల్స్‌ కమాన్‌ సమీపంలో రోడ్డుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని ఫేక్ రెండు వేల కరెన్సీ నోట్లను రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. దీంతో అటుగా వెళ్తున్న స్థానికులు, వాహనదారులు వాటిని నిజమైన నోట్లుగా భావించి తీసుకునేందుకు పోటీపడ్డారు. తీరా వాటిని పరిశీలిస్తే, అవి ఫేక్ కాగితాలుగా తేలడంతో అంతా ఉసూరుమన్నారు. కాగా ఈ నోట్లను నిజమైనవిగా భావించి వాటిని దక్కించికునేందుకు.. స్థానికులు, వాహనదారులు పోటీపడటంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా పిల్లలు ఆడుకునేందుకు ఆ నోట్స్ వినియోగిస్తున్నారని విచారణలో తేలింది. పండక్కి తమ పంట పండింది.. అనుకుని ఆ నోట్లను ఎత్తుకున్నవారందరూ అసలు విషయం తెలిసి.. వాటిని అక్కడే పడేని.. నిరాశతో ఇళ్ల బాట పట్టారు.

Also Read: Telangana: భార్య మరణం.. ఆమె లేని లోకంలో ఉండలేనంటూ ఆళి వెంటే భర్త పయనం

Viral Video: ఒక్క సెకన్ గ్యాప్.. లేదంటే నుజ్జునుజ్జయిపోయేవాడు.. షాకింగ్ వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us