తల్లిదండ్రులూ అలర్ట్.. ఐదేళ్లలోపు పిల్లలకు నేడు పోలియో చుక్కలు.. మూడు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్!

తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు చుక్కల పోలియో టీకా వేస్తున్నారు. మొత్తం 18,01,698 మంది పిల్లలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 7,428 బూత్‌లు ఏర్పాటు చేశారు. బూత్‌లకు రాలేని పిల్లలకు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు.

తల్లిదండ్రులూ అలర్ట్.. ఐదేళ్లలోపు పిల్లలకు నేడు పోలియో చుక్కలు.. మూడు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్!
Pulse Polio Drive In Hyderabad

Updated on: Nov 22, 2026 | 7:22 AM

హైదరాబాద్: పోలియో మహమ్మారిని సమూలంగా తరిమికొట్టే దిశగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ సబ్-నేషనల్ ఇమ్యునైజేషన్ డే (SNID-2026)లో భాగంగా ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇవాళ (నవంబర్ 22, ఆదివారం) హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు చుక్కల ఓరల్ పోలియో వ్యాక్సిన్ (bOPV) అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు ఐదు జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

ఈ ఐదు జిల్లాల్లో కలిపి మొత్తం 18,01,698 మంది చిన్నారులకు టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 7,428 పోలియో బూత్‌లు, 245 మొబైల్ బృందాలు, 245 ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఆదివారం బూత్‌లకు రాలేని పిల్లల కోసం నవంబర్ 23, 24 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి సిబ్బంది పోలియో చుక్కలు వేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో నవంబర్ 25న కూడా ఈ డ్రైవ్ కొనసాగుతుంది.

వలస కుటుంబాలు, సంచార జాతులు, భవన నిర్మాణ కార్మికులు, ఇటుక బట్టీల వద్ద పనిచేసేవారు, మురికివాడలు, గిరిజన, మత్స్యకార గ్రామాల్లోని పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలోని 1,165 అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోని 6,172 డిజిటల్ స్క్రీన్లపై మూడు రోజుల పాటు అవగాహన సందేశాలను ప్రదర్శించనున్నారు. తల్లిదండ్రులంతా తమ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు అధికారులు పిలుపునిచ్చారు.

Loading...
Unable to load recommendations.
Follow Us