NIA: దసరా వేడుకల్లో పేలుళ్లకు జావేద్ గ్యాంగ్ ప్లాన్.. హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్ర కేసు ఎన్‌ఐఏకు బదిలీ..

భారత్‌పై పాకిస్థాన్ పెద్ద కుట్ర బయటపడింది. హైదరాబాద్‌లో 'లోన్ వోల్ఫ్ అటాక్'కు సన్నాహాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్, నేపాల్ మీదుగా జావెద్ గ్యాంగ్ హైదరాబాద్‌కు పేలుడు పదార్ధాలను తరలిచింది.

NIA: దసరా వేడుకల్లో పేలుళ్లకు జావేద్ గ్యాంగ్ ప్లాన్.. హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్ర కేసు ఎన్‌ఐఏకు బదిలీ..
NIA
Follow us

|

Updated on: Feb 05, 2023 | 12:09 PM

హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించేందుకు కుట్రను ఎన్ఐఉ చేధించింది. పేలుళ్లకు కుట్ర పన్నిన జావెద్ గ్యాంగ్‌పై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఎన్‌ఐఏ ఇంటరాగేషన్ మొదలుపెట్టింది. 2022 డిసెంబర్ మాసంలో జావెద్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్, నేపాల్ మీదుగా జావెద్ గ్యాంగ్ హైదరాబాద్‌కు పేలుడు పదార్ధాలను తరలిచింది. దసరా రోజున ఈ బ్లాసింగ్‌రే ప్లాన్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఎన్ఐఏ తమ దర్యాప్తులో కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నగరంలో రద్దీ ఉండే ప్రాంతాల్లో ఈ పేలుళ్లకు పాల్పడాలని నిందితులు వ్యూహం పన్నినట్లుగా తెలుస్తోంది. దేశంలో అంతర్గత భద్రతకు ముప్పు కల్గించేలా ఈ ముఠా ప్లాన్ చేసింది.

హైదరాబాద్‌లో పట్టుబడిన ఉగ్రవాదిని విచారించగా ఈ విషయం వెల్లడైంది. ఐఎస్‌ఐ, లష్కర్‌ల లింక్ కూడా తెరపైకి వచ్చింది. అరెస్టయిన ఉగ్రవాది జహీద్ పాకిస్థాన్‌లో కూర్చున్న హ్యాండ్లర్‌లతో పరిచయం కలిగి ఉన్నాడు. అతనికి హ్యాండ్ గ్రెనేడ్‌లు సరఫరా చేయబడ్డాయి.

సమాచారం ప్రకారం, అతను నిర్వాహకుల కోరికతో చాలా మందిని రిక్రూట్ చేసుకున్నాడు. ర్యాలీ లేదా బహిరంగ ప్రదేశంపై దాడికి ప్లాన్ సిద్ధం చేశారు. ఇదంతా పాకిస్థాన్ ఆదేశాల మేరకే జరిగింది. భారతదేశంలో మత సామరస్యానికి భంగం కలిగించే కుట్ర జరుగుతోంది.

ఉగ్రవాది నుంచి హ్యాండ్ గ్రెనేడ్, నగదు, ఫోన్ స్వాధీనం

ఎన్ఐఏ విచారణలో ఎఫ్ఐఆర్ ద్వారా పాకిస్తాన్ కుట్ర బయటపడింది. ఉగ్రవాది జహీద్‌ స్థావరం నుంచి 2 హ్యాండ్‌ గ్రెనేడ్లు, రూ.4 లక్షల నగదు, రెండు మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. జహీద్ ఆత్మాహుతి బాంబు కేసులో ప్రమేయం ఉన్నందున 2005లో అరెస్టు చేయబడ్డాడు. అయితే సాక్ష్యాలు లేకపోవడంతో 2017లో విడుదలయ్యాడు.

ఎన్ఐఏ అందించిన సమాచారం ప్రకారం, జహీద్ తన ముఠా సభ్యులతో కలిసి పాకిస్తాన్ నుండి వారి హ్యాండ్లర్ల సూచనల ఆధారంగా హైదరాబాద్ నగరంలో పేలుళ్లు.. ఒంటరి తోడేలు దాడులతో సహా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి కుట్ర పన్నాడు.

గతేడాది జాహీద్‌ను అరెస్టు

జహీద్ తన హ్యాండ్లర్ల నుండి హ్యాండ్ గ్రెనేడ్ అందుకున్నాడని.. మతపరమైన ఉద్రిక్తత సృష్టించడానికి నగరంలో బహిరంగ సభలు, ఊరేగింపులలో వారిని విసిరేందుకు ప్లాన్ చేస్తున్నాడని కూడా NIA తెలిపింది. అక్టోబర్ 2, 2022 న, హైదరాబాద్ పోలీసులు బహిరంగ సభలలో గ్రెనేడ్లు విసిరేందుకు కుట్ర పన్నినందుకు అబ్దుల్ జహీద్, మహ్మద్ సమీయుద్దీన్, మజ్ హసన్ ఫరూక్‌లను అరెస్టు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం