Hyderabad: ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగాన్ని తగ్గించేందుకు ఇద్దరు యువకుల అద్భుత సృష్టి.. ఎకో వాటర్ బాటిల్స్

ఓ ఇద్దరు యువకులు తిరుమల తిరుపతి(Tirumala Tirupati) పుణ్యక్షేత్రానికి స్వామివారి దర్శనం కోసం వెళ్లారు. అక్కడ జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని స్వయంగా వీక్షించారు. పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను దృష్టిలో ఉంచుకుని వాటి వినియోగాన్ని తగ్గించాలని భావించారు.

Hyderabad: ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగాన్ని తగ్గించేందుకు ఇద్దరు యువకుల అద్భుత సృష్టి.. ఎకో వాటర్ బాటిల్స్
Eco Friendly Water Bottles
Follow us

|

Updated on: May 21, 2022 | 1:28 PM

Eco Friendly Water Bottles: కొంతమంది తమ కళ్ళ ఎదుట ఏమిటి జరుగుతున్నా మనకు ఎందుకు అంటూ ఆలోచిస్తూ.. తమకు ఏమీ కాదన్నట్లు పట్టించుకోకుండా నిశ్చలంగా జీవిస్తారు. అది సాటి మనుషుల విషయమైనా, పర్యావరణ విషయంలోనైనా.. అయితే మరికొందరు.. మనుషులకే కాదు.. పర్యావరణ పరిరక్షణ కోసం ఆలోచిస్తారు. తమను ప్రభావితం చేసిన అంశాలతో కొత్త ఆలోచనలు చేస్తారు. అలా వచ్చిన ఆలోచనలతో.. సరికొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. ఓ ఇద్దరు యువకులు తిరుమల తిరుపతి(Tirumala Tirupati) పుణ్యక్షేత్రానికి స్వామివారి దర్శనం కోసం వెళ్లారు. అక్కడ జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని స్వయంగా వీక్షించారు. పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను దృష్టిలో ఉంచుకుని వాటి వినియోగాన్ని తగ్గించాలని భావించారు.  స్టార్టప్ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు (Plastic Water Bottles) బదులుగా పర్యావరణ అనుకూల వాటర్ బాక్స్‌లను తయారు చేశారు. స్ఫూర్తివంతమైన ఆ ఇద్దరి యువకుల గురించి ఈరోజు తెలుసుకుందాం..

సునీత్ తాతినేని, చైతన్య అయినపూడి అనే ఇద్దరు కుర్రాళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. దేవుడి దర్శనం చేసుకోవడానికి కొండపై ఒక రోజు గడిపారు. ఆ సమయంలో 24 లీటర్ల నీరు తాగారు. దీంతో ప్లాస్టిక్‌ బాటిళ్లు వినియోగం గురించి ఆలోచన వచ్చింది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే లక్ష్యంతో..అప్పుడే ఆ ఇద్దరు యువకులు తమ ఐటీ ఉద్యోగాలకు రిజైన్ చేశారు.  కొన్ని రోజులు ఇంటర్‌నెట్‌లో రకరకాల విషయాలపై అన్వేషణ చేశారు. చివరకు ‘కారో వాటర్’ అంటే ‘డియర్ వాటర్’ అనే స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలి ఎకో ఫ్రెండ్లీ డ్రింకింగ్ వాటర్ బాక్స్ ను సృష్టించారు. వాటర్ బాటిల్ ను ఎక్కడి కైనా తీసుకెళ్లేలా, ఇంట్లో, ఆఫీసుల్లో వాడుకునేలా సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. అలా వారికి వచ్చిన ఆలోచనే పేపర్‌ బాక్స్‌, అందులో నీటి నిల్వ చేసేలా ప్రయత్నించి విజయం సాధించారు.

వీళ్లు తయారు చేసిన కారో బాటిల్‌ సుమారు రెండు వందల నుంచి మూడు వందల లీటర్లు నీటిని వడపోస్తుంది. ప్లాస్టిక్ వాటల్ బాటిల్స్ ను వాడుతూ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు పేపర్‌తో కారో బాక్స్ వినియోగం వలన ఎటువంటి సమస్య తలెత్తదని తయారీదారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ బాక్సులు, బ్యాగులు పర్యావరణ అనుకూలమైనవని, వీటిని రీసైకిల్ చేయనున్నట్లు సునీత్ తాతినేని తెలిపారు. ఈ బాక్సుల నుండి ఏదీ ల్యాండ్ ఫిల్లింగ్‌లో ముగియకుండా చూసుకోవడానికి తాము నగరంలోని రీసైక్లింగ్ యూనిట్లతో టైఅప్ చేసామని ఆయన తెలిపారు. రీసైకిల్ చేసిన కార్డ్‌బోర్డ్ , బాక్సుల్లోని వాటర్ బ్యాగ్‌లను ఇతర అవసరాలకు ఉపయోగిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ వాటర్ బాక్సులు 5 లీటర్లు , 20 లీటర్లు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయని సునీత్ తెలిపారు. 5-లీటర్ బాక్స్ 75 రూపాయలకు లభించనుండగా..  20 లీటర్ల వాటర్ బాక్స్‌కు రూ. 120లు చెల్లించాల్సి ఉంది. దీంతో బిపిఎ లేదా బిస్ఫినాల్ఎ కూడా పూర్తిగా ఉచితంగా ఇస్తున్నామని సునీత్ చెప్పారు.

పర్యావరణ పరిరక్షణ  బాక్సులలో రోజువారీ తాగునీటిని సరఫరా చేయాలనే ఆలోచన ప్రత్యేకమైనదని కారో వాటర్ సహ వ్యవస్థాపకుడు చైతన్య  చెప్పారు. ఇవి దేశంలోనే మొదటివి అని అన్నారు. మొదటి మూడు నెలల్లోనే దాదాపు 8,000వేల ఈ ఎకో ఫ్రెండ్లీ డ్రింకింగ్ వాటర్ బాక్స్ ను అమ్మినట్లు చెప్పారు. గ్రౌండ్ లెవెల్‌లో మార్పు తీసుకురావడానికి ప్లాస్టిక్ వ్యర్థాలు ఎప్పుడూ కుప్పలు తెప్పలుగా ఉండే ఆసుపత్రులు, హోటళ్లు, చిన్న తరహా పార్టీలపై ఎక్కువ దృష్టి పెట్టామని చైతన్య పేర్కొన్నారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని కొన్ని హోటళ్లు, ఆసుపత్రుల్లో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల స్థానంలో ఈ వాటర్‌ బాక్సులను అమర్చడం ప్రారంభించినట్లు తెలిపారు. ఇలాంటి మార్పు ప్రతి చోటా వస్తుందని ఆశిస్తున్నా అన్నారు. సేవలు విస్తరించి పెట్టుబడులు ఆకర్షించేందుకు బెంగళూరులో కూడా ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించారట.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు