Hyderabad: ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా..10 డేస్ డెడ్ లైన్

హైదరాబాద్‌లో హైడ్రా స్పీడ్ పెంచింది. ఆక్రమణలకు గురైన స్థలాలను గుర్తించి చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా నార్సింగ్ సమీపంలోని ముష్కిన్ చెరువు సమీపంలో ఎఫ్‌టీఎల్ పరిధిలో ఏర్పాట్లు చేసుకున్న దుకాణాలు, షెడ్డులపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

Hyderabad: ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా..10 డేస్ డెడ్ లైన్
Hydra

Edited By:

Updated on: Apr 29, 2026 | 8:49 PM

గండిపేట మండలం నార్సింగ్ సమీపంలోని ముష్కిన్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న తాత్కాలిక షెడ్డులు, దుకాణాలను 10 రోజుల్లో ఖాళీ చేయాలని హైడ్రా అధికారులు ఆదేశించారు. చెరువు పరిధిలో మట్టి, నిర్మాణ వ్యర్థాలు పోసి ఆక్రమణలకు పాల్పడుతున్నారని, చెరువు స్వరూపం దెబ్బతింటోందని పేర్కొన్నారు. అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, ఏసీపీ తిరుమల్ తదితర అధికారులు అక్కడ నివసిస్తున్న వారితో మాట్లాడి హెచ్చరికలు జారీ చేశారు. పేదలను అడ్డంపెట్టుకుని కబ్జాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తం 52.20 ఎకరాల ఎఫ్‌టీఎల్ పరిధిని పరిరక్షించి చెరువును అభివృద్ధి చేయాలని హైడ్రా నిర్ణయించింది. చెరువును కాపాడేందుకు చర్యలు తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు

Follow Us