ఫిల్మ్ నగర్‌లో విషాదం: నాగేళ్ల కుమారుడికి ఉరి వేసి.. తల్లి ఆత్మహత్య..! ఆత్తింటి వేధింపులకు తల్లీబిడ్డ బలి

హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత, తన కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విషాద ఘటన ఫిల్మ్‌నగర్‌లోని జూబ్లిహిల్స్‌..

ఫిల్మ్ నగర్‌లో విషాదం: నాగేళ్ల కుమారుడికి ఉరి వేసి.. తల్లి ఆత్మహత్య..! ఆత్తింటి వేధింపులకు తల్లీబిడ్డ బలి
Film Nagar Crime

Updated on: Jun 24, 2023 | 12:01 PM

ఫిల్మ్‌నగర్: హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత, తన కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విషాద ఘటన ఫిల్మ్‌నగర్‌లోని జూబ్లిహిల్స్‌లో శుక్రవారం (జూన్‌ 23) రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఫిల్మ్ నగర్‌లో నివాసం ఉంటోన్న విశ్వనాథ్, శిరీష (22) దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు మూడేళ్ల బాలుడు మనీస్ ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు శనివారం రాత్రి శిరీష, తన కొడుకు మనీష్‌ ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కి ఉరి వేసుకుని విగతజీవులుగా కనిపించారు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అసలేం జరిగిందంటే..

పెళ్లైన నాటి నుంచి శిరీషను అత్తింటి వారు నానాకష్టాలు పెట్టేవారు. బాలుడు మనీష్‌ పుట్టాక వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. ఇప్పుడు శిరీష మళ్లీ మూడు నెలల గర్భిణి అని తెలిసి అత్తింటి వేధింపులు జాస్తి అయ్యాయి. అటు పుట్టింటికి చెప్పుకోలేక ఇటు అత్తింటి వేధింపులు భరించలేక చివరకు ఆత్మహత్య శరణ్యమని భావించింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. శిరీష గదిలోనుంచి ఎంతకు బయటకు రాకపోవడంతో భర్త విశ్వనాథ్ గదిలోకి వెళ్లి చూడగా కుమారుడు మనీష్‌తోపాటు భార్య శిరీష ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. పరుగున వెళ్లి తల్లిదండ్రులకు ఈవిషయం చెప్పాడు విశ్వనాథ్‌. అనంతరం శిరీష కుటుంబానికి సమాచారం అందించారు. శిరీష మృతదేహాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. తమ కూతురు, మనవడు మృతికి ఆమె అత్తింటి వారే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిరీషది నిజంగా ఆత్మహత్యా? లేదా భర్య, అత్తమామలు చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us